సీఎం బంధువు దెబ్బకు వణుకుతున్న గోదావరి జిల్లా

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కరరావు వ్యవహారశైలి పదేపదే వివాదాస్పదమవుతోంది. ఆయన దెబ్బకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు వణికిపోతున్నాయి. ప్రతిపక్షాలే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా ఆయన బాధితుల జాబితాలో నిలుస్తున్నారు. కేవలం తమకు కావాల్సిన ఇద్దరుముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే కాటమనేని భాస్కరరావు పనులు చేసి పెడుతున్నారని నేతలు వాపోతున్నారు. సీఎం బంధువని చెప్పుకుంటూ మంత్రులు మాణిక్యాలరావు, పీతల సుజాతను కూడా పూచిపుల్లతో సమానంగా తీసివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానల్‌ నిర్వహించిన చర్చలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా నేతలు కలెక్టర్ గురించి కథలు కథలుగా చెప్పి వాపోయారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టర్ రాజ్యం నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంతలి సీతారాం వాపోయారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే కలెక్టర్ పనులు చేసిపెడుతున్నారని ఆరోపించారు. చింతమేని ప్రభాకర్, కలెక్టర్ కాటమనేనికి బంధుత్వం కూడా ఉందని ఆయన వెల్లడించారు. కలెక్టర్ పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇంతటి వరెస్ట్ కలెక్టర్‌ పశ్చిమగోదావరి జిల్లా చరిత్రలో లేరని తీవ్ర వ్యాఖ్య చేశారు. చిన్న ధర్నా చేసినా సహించలేకపోతున్నారని అన్నారు. ఎవరైనా పనిమీద వెళ్తే టీడీపీ సభ్యత్వం కార్డు అడిగే దుస్థితి జిల్లాలో దాపురించిందన్నారు. సీతారాం వ్యాఖ్యలతో కాంగ్రెస్,వైసీపీ నేతలు కూడా ఏకీభవించారు. జిల్లాలో టీడీపీ నేతలు మాఫియాగా తయారయ్యారని ఏలూరు పట్టణ కాంగ్రెస్ నేత రామ్మోహన్ రావు చెప్పారు. కలెక్టర్‌ టీడీపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం కొందరు ఎమ్మెల్యేలకు మాత్రమే పనులు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కూడా గతంలోచెప్పారన్నారు. చర్చాకార్యక్రమానికి ఫోన్‌ చేసిన మధుసూదన్ అనే కాలర్ కూడా కలెక్టర్‌ టీడీపీ నేతలా పనిచేస్తున్నారని ఆరోపించారు. తాము ఒక సమస్య మీద వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే దాన్ని తీసుకునేందుకు కూడా అసహనం వ్యక్తం చేశారని చెప్పారు.

కలెక్టర్ కాటమనేని తీరుపై వైసీపీ, సీపీఎం, కాంగ్రెస్ నేతలే కాదు గతంలో జిల్లాకు చెందిన ఎస్సీఎస్టీ, బీసీ టీడీపీ ఎమ్మెల్యేలే సీఎంకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తనకు బంధువు అంటూ కాటమనేని భాస్కర్ ప్రజాప్రతినిధులను దారుణంగా ట్రీట్ చేస్తున్నారని ఆగ్రహం చేస్తూ కొన్ని నెలల క్రితం తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కలెక్టర్ కాటమనేని తానో కింగ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యానారాయణ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు కూడా కేవలం చింతమనేని, తణుకు నియోజవకర్గాలకు మాత్రమే కేటాయిస్తున్నారని జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే సీఎం తనకు బంధువంటూ బెదిరిస్తున్నారని టీడీపీ నేతలే ఆరోపణలు చేశారు. తాజాగా టీవీ చర్చకార్యక్రమంలో విపక్ష నేతలు కలెక్టర్ కాటమనేనిని జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అభివర్ణించారు.

Click on Image to Read:

amaravathi-formers

revanth-reddy