కాటమరాయుడులో కీలక మార్పు

కాటమరాయుడు ప్రాజెక్టులో ఇప్పటికే చాలా మార్పులు జరిగాయి. అన్నింటికంటే పెద్ద మార్పు దర్శకుడు మారిపోవడమే. మొదట అనుకున్న డైరక్టర్ ఇప్పుడు లేడు. ఎస్ జే సూర్యతో పట్టాలపైకి రావాల్సిన ప్రాజెక్టును ఇప్పుడు డాలీ హ్యాండిల్ చేస్తున్నాడు. హీరోయిన్ గా చాలామంది పేర్లు పరిశీలించి ఫైనల్ గా శృతిహాసన్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఇప్పుడు కాటమరాయుడులో మరో మార్పు జరిగినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకు మొదట సినిమాటోగ్రాఫర్ గా సౌందర్ రాజన్ ను అనుకున్నారు. కానీ కాటమరాయుడు అనుకున్న టైమ్ కి మొదలు కాకపోవడంతో సౌందర్ రాజన్.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఈయన స్థానంలో పవన్ కెరీర్లోనే బిగ్గెట్స్ హిట్ గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వహించిన ప్రసాద్ మూరెళ్ళ ను తీసుకున్నారట. దీంతో ప్రాజెక్టుపై మరింత హైప్ పెరిగింది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిసున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మరో 2 రోజుల్లో పవన్ కల్యాణ్ కూడా సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. 
Click on Image to Read:
ntr
alluarjun