Telugu Global
NEWS

సినిమా టిక్కెట్ల ధరలు పెరగబోతున్నాయా..?

కేంద్రప్రభుత్వం జీఎస్టీని అమలుచేస్తే రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచడానికి సినిమా పరిశ్రమ సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌ చిన్నసినిమాలకు 7శాతం, పెద్ద సినిమాలకు 12 శాతంగా ఉంది. అలాగే స్థానికేతర సినిమాలకు 24 శాతంగా ఉంది. గ్రామాల్లో అయితే ఈ టాక్స్‌ లేదు. జీఎస్టీ అమలైతే ఈ తేడాలు లేకుండా అన్ని సినిమాలపై, అన్ని ప్రాంతాల్లో 22 శాతం జీఎస్టీ అమలు అవుతుంది. అందుకే సినిమా పెద్దలు సినిమా పరిశ్రమను […]

సినిమా టిక్కెట్ల ధరలు పెరగబోతున్నాయా..?
X

కేంద్రప్రభుత్వం జీఎస్టీని అమలుచేస్తే రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచడానికి సినిమా పరిశ్రమ సిద్ధంగా ఉంది.

ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌ చిన్నసినిమాలకు 7శాతం, పెద్ద సినిమాలకు 12 శాతంగా ఉంది. అలాగే స్థానికేతర సినిమాలకు 24 శాతంగా ఉంది. గ్రామాల్లో అయితే ఈ టాక్స్‌ లేదు. జీఎస్టీ అమలైతే ఈ తేడాలు లేకుండా అన్ని సినిమాలపై, అన్ని ప్రాంతాల్లో 22 శాతం జీఎస్టీ అమలు అవుతుంది.

అందుకే సినిమా పెద్దలు సినిమా పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దని కోరుతున్నారు. అలా కాకుండా జీఎస్టీ అమలుచేస్తే ఆ భారాన్ని ప్రేక్షకులకు బదలాయిస్తామని, ఆమేరకు టిక్కెట్ల ధరలు పెంచుతామని చెబుతున్నారు. ఈ మేరకు సినిమా పెద్దలు అటు కేంద్ర ఆర్ధిక మంత్రితోనూ, ట్యాక్స్‌ కన్సల్టెంట్స్‌తోనూ చర్చించడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటివరకు టిక్కెట్‌ ధరలోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌ కలిపి వసూలు చేస్తున్నారు. ఇక నుంచి దీనికి జీఎస్టీ 22శాతాన్ని కలిపి టిక్కెట్‌ ధరలు నిర్ణయిస్తారు. కర్ణాటక, తమిళనాడులలో అయితే టిక్కెట్‌ ధరలు చాలా ఎక్కువ పెరుగుతాయి. ఇప్పటివరకు అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌ కూడా లేదు. కాబట్టి ఒకేసారి 22శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఒక్క కేరళలలో మాత్రం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గుతాయి. ఇప్పుడు అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌ 25 శాతంగా ఉంది. అది జీఎస్టీ అమలైతే 22శాతానికి తగ్గుతుంది.

First Published:  21 Sep 2016 10:25 PM GMT
Next Story