Telugu Global
Cinema & Entertainment

క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డు..!

సౌత్ ఇండియాలో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ  చాలా చిన్న‌ది.  అక్క‌డ కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ అంటే చాలా ఎక్కువ అని చెప్పే వారు. కానీ మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ మ‌న‌వ‌డు నిఖిల్ ను   ఏకంగా  50 నుంచి 60 కోట్ల  బ‌డ్జెట్  పెట్టి  జాగ్వార్  అనే చిత్రం చేశారు. క‌న్న‌డ లాంగ్వేజ్ తో పాటు.. త‌మిళ్, తెలుగు  భాష‌ల్లో  జాగ్వార్ చిత్రాన్ని ఒకే స‌మ‌యంలో రిలీజ్  చేస్తున్నారు.    క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో  రాజ‌కీయం,  సినిమా రెంటిలో ప్ర‌వేశం […]

క‌న్న‌డ  సినిమా  ఇండ‌స్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డు..!
X
సౌత్ ఇండియాలో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ చాలా చిన్న‌ది. అక్క‌డ కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ అంటే చాలా ఎక్కువ అని చెప్పే వారు. కానీ మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ మ‌న‌వ‌డు నిఖిల్ ను ఏకంగా 50 నుంచి 60 కోట్ల బ‌డ్జెట్ పెట్టి జాగ్వార్ అనే చిత్రం చేశారు. క‌న్న‌డ లాంగ్వేజ్ తో పాటు.. త‌మిళ్, తెలుగు భాష‌ల్లో జాగ్వార్ చిత్రాన్ని ఒకే స‌మ‌యంలో రిలీజ్ చేస్తున్నారు. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో రాజ‌కీయం, సినిమా రెంటిలో ప్ర‌వేశం వున్న క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార స్వామి త‌న‌యుడు నిఖిల్ ను ఒకేసారి సూప‌ర్ స్టార్ చిత్రం రేంజ్ లో డెబ్యూగా ప‌రిచ‌యం అనేది సౌత్ లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఈ రేంజ్ బ‌డ్జెట్ తో సినిమా చేయ‌డం క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో ఆల్ టైమ్ రికార్డ్ గానే చెబుతున్నారు క్రిటిక్స్.
ఈ చిత్రం ట్రైలర్‌లో జగపతిబాబు, రమ్యకృష్ణ, సంపత్, బ్రహ్మానందం లాంటి సీనియర్ నటీనటులను చూపించడంతో చిత్రానికి హైప్రొఫైల్ లుక్ వచ్చేసింది. హీరో.. మెడికల్ స్టూడెంట్‌గా.. జాగ్వార్‌గా గెటప్లు మార్చి చూపించే క్యారెక్టర్ బాగానే పండించినట్లు యూనిట్ చెబుతున్నమాట. ఇక యాక్షన్ పార్ట్, స్టంట్స్, స్టైల్స్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. ఇక నిఖిల్‌ పక్కన హీరోయిన్‌గా దీప్తి సతి నటిస్తోంది. మహదేవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్.
First Published:  21 Sep 2016 1:17 PM GMT
Next Story