ఆ వార్త విని అంతా షాక్

సినీ తారల విడాకుల వ్యవహారాలు ఒకప్పుడు ఎక్కవగా బాలీవుడ్లోనే కనిపించేవి. ఈ మధ్య కాలంలో సౌత్ సినీ పరిశ్రమలో కూడా ఇవన్నీ కామన్ అయ్యాయి. ఇటీవల కాలంలో ప్రముఖ హీరోయిన్ అమలా పాల్, రజనీకాంత్ కూతురు సౌందర్య విడాకుల వ్యవహారాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ఇలాంటిదే మరో షాకింగ్ న్యూస్. సౌత్ హీరోయిన్ రేష్మి మీనన్, నటుడు బాబీ సింహ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పట్టుమని పది నెలలు కూడా గడవక ముందే వీరు విడిపోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలొచ్చాయి.

 ఈ వ్యవ‌హారంపై రేష్మి మీనన్ వెంటనే స్పందించారు. ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘నాకు రూమర్ల మీద స్పందించే అలవాటు లేదు. కానీ ఇటీవల ఓ రూమర్ నన్ను బాగా బాధించింది. మేం విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ వార్తలను నమ్మవద్దు’ అంటూ ఆమె ట్వీట్ చేసారు.