Telugu Global
Cinema & Entertainment

సోనాక్షి కూడా చూడ‌లేద‌ట‌..! 

వార‌స‌త్వం అనేది అబ్బాయిల‌కు క‌లిసోచ్చిన‌ట్లు అమ్మాయిల‌కు క‌లసిరాదేమో అనిపిస్తుంటుంది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ను చూస్తే.  ద‌బంగ్ చిత్రంతో న‌టిగా ప‌రిచ‌య‌మైన  ఈ బీహార్ బ్యూటీ త‌న తండ్రి  శ‌త్రుఘ్న సిన్హా న‌ట వారసురాలిగా వ‌చ్చింది. డెబ్యూ చిత్రం  హిట్ కావ‌డంతో.. అవ‌కాశాలు వ‌ర‌స క‌ట్టాయి. అయితే   త‌రువాత  కొన్ని ఫెయిల్యూర్స్ ప‌ల‌క‌రించ‌డంతో  ..  క‌మ‌ర్షియ‌ల్ గా మంచి హిట్ కోసం వెయిట్ చే్స్తుంది. అయితే హీరోయిన్ గా  మాత్రం  వైవిధ్య‌మైన చిత్రాలు చేయ‌డానికే ప్రాధాన్య‌త […]

సోనాక్షి కూడా చూడ‌లేద‌ట‌..! 
X
వార‌స‌త్వం అనేది అబ్బాయిల‌కు క‌లిసోచ్చిన‌ట్లు అమ్మాయిల‌కు క‌లసిరాదేమో అనిపిస్తుంటుంది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ను చూస్తే. ద‌బంగ్ చిత్రంతో న‌టిగా ప‌రిచ‌య‌మైన ఈ బీహార్ బ్యూటీ త‌న తండ్రి శ‌త్రుఘ్న సిన్హా న‌ట వారసురాలిగా వ‌చ్చింది. డెబ్యూ చిత్రం హిట్ కావ‌డంతో.. అవ‌కాశాలు వ‌ర‌స క‌ట్టాయి. అయితే త‌రువాత కొన్ని ఫెయిల్యూర్స్ ప‌ల‌క‌రించ‌డంతో .. క‌మ‌ర్షియ‌ల్ గా మంచి హిట్ కోసం వెయిట్ చే్స్తుంది.
అయితే హీరోయిన్ గా మాత్రం వైవిధ్య‌మైన చిత్రాలు చేయ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తుంది. ఈ మ‌ధ్య ముర‌గ‌దాస్ డైరెక్ష‌న్ లో అకీరా అనే వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం చేసి మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే అంతగా ఆడియ‌న్స్ ను మెప్పించ‌లేదు.
కట్ చేస్తే ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మంచ‌నున్నఇట్టెఫాక్ అనే చిత్రం రీమేక్ లో సోనాక్షి న‌టిస్తుంది. సిద్ధార్ధ్ మ‌ల్హోత్ర హీరో . ఇట్టెఫాల్ చిత్రం గురించి ఈ త‌రానికి తెలియ‌దు. ఈ జ‌న‌రేష‌న్ వారికి కొత్త‌గా ఉంటుంద‌ని .. త‌ను కూడా ఇట్టెఫాల్ చిత్రం చూడ‌లేద‌ని తెలిపింది. అయితే త‌ను ప్రొడ్యూస‌ర్ ఆర్డ‌ర్ మేర‌కే ఈ చిత్రం చూడ‌లేద‌ని చెప్పింది. మ‌రి క‌ర‌ణ్ జోహార్ ఎందుకు సొనాక్షి ని సినిమా చూడొద్ద‌న్నాడో ఆయ‌న‌కే తెలియాలి? ఇక క‌రాచీ యు ఆర్ కిల్లింగ్ మీ అనే న‌వ‌లా ఆధారంగా తెర‌కెక్క‌నున్న నూర్ చిత్రం లో సోనాక్షి పాత్రికేయురాలిగా న‌టిస్తుంది.
First Published:  22 Sep 2016 12:11 AM GMT
Next Story