Telugu Global
Cinema & Entertainment

గుట్టు విప్పిన త‌మ‌న్నా...

ఒక ఐడియా జీవితానే మార్చేస్తుంది. అలాగే ఒక హిట్ హీరోయిన్  కెరీర్ ను ట‌ర్న్ చేస్తుంది. అలా   తెలుగులో  త‌మ‌న్నాకు  ప‌డిన హిట్  సుకుమార్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన 100 ప‌ర్సెంట్ ల‌వ్.   అప్ప‌టికే ఆల్మోస్ట్  తెలుగు నుంచి  కోలీవుడ్ కు  వెళ్లినా త‌ము బేబి..ఆ చిత్రం  సూప‌ర్ స‌క్సెస్ తో  అవకాశాలు వ‌ర‌స క‌ట్టాయి.   న‌టిగా  ద‌శాబ్ధ కాలం   పూర్తి చేసుకున్న త‌మ‌న్నా..  బాహుబ‌లి  సినిమా ముందు కొన్ని ఫెయిల్యూర్స్ […]

గుట్టు విప్పిన త‌మ‌న్నా...
X
ఒక ఐడియా జీవితానే మార్చేస్తుంది. అలాగే ఒక హిట్ హీరోయిన్ కెరీర్ ను ట‌ర్న్ చేస్తుంది. అలా తెలుగులో త‌మ‌న్నాకు ప‌డిన హిట్ సుకుమార్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన 100 ప‌ర్సెంట్ ల‌వ్. అప్ప‌టికే ఆల్మోస్ట్ తెలుగు నుంచి కోలీవుడ్ కు వెళ్లినా త‌ము బేబి..ఆ చిత్రం సూప‌ర్ స‌క్సెస్ తో అవకాశాలు వ‌ర‌స క‌ట్టాయి.
న‌టిగా ద‌శాబ్ధ కాలం పూర్తి చేసుకున్న త‌మ‌న్నా.. బాహుబ‌లి సినిమా ముందు కొన్ని ఫెయిల్యూర్స్ చ‌వి చూసింది. అయితే రాజ‌మౌళి బాహుబ‌లిలో త‌న‌కు ఇచ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది. ఆ త‌రువాత మ‌ళ్లీ కెరీర్ ప‌రంగా బిజీ అయ్యింది. ఇక త‌నలో యాక్టింగ్ గురించి చెబుతూ..నాలోని క‌థానాయిక‌కి కాకుండా, న‌టికి అవ‌కాశ‌మిచ్చిన‌ప్పుడే నాకు తృప్తి అంటోంది ప‌దేళ్లుగా చిత్రసీమలో కొన‌సాగుతున్న త‌మ‌న్నా. ఈ పదేళ్ల ప్ర‌యాణంలో ఫెయిల్యూర్స్ ఎదురైన‌ప్ప‌టికి కెరీర్ ను తీర్చి దిద్దుకుంది.ఒక మంచి పాత్ర ఉంటే ఎంత సేపైనా సెట్ లో గ‌డ‌పాల‌నిపిస్తుంద‌ట ఈ ముద్దుగుమ్మ‌కు. ప్ర‌స్తుతం 'అభినేత్రి' పేరు తో ఒక బాహుభాషా చిత్రం త‌మ‌న్నా చేస్తున్న విష‌యం తెలిసిందే.
First Published:  21 Sep 2016 11:59 PM GMT
Next Story