Telugu Global
NEWS

కామెడీలోనూ రెండు పెగ్గుల సిద్ధాంతమేనా? వాళ్లు ఏమైపోవాలి బాబు గారు...

రెండు కళ్ల సిద్ధాంతానికి చంద్రబాబును పితామహుడిగా అభివర్ణిస్తుంటాయి ప్రతిపక్షాలు. తెలంగాణకు వెళ్లి ప్రత్యేక రాష్ట్రం తన లేఖ వల్లే వచ్చిందని చెప్పడం, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి కాంగ్రెస్‌, వైసీపీ కలిసి కుట్రపూరితంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశాయని చంద్రబాబు ఆరోపించడంతో ఆయనకు రెండు కళ్ల సిద్ధాంత సృష్టికర్తగా పేరొచ్చింది. రాష్ట్ర విభజన లాంటి సీరియస్ అంశాల్లోనే కాదు కామెడీ చేసేటప్పుడు కూడా చంద్రబాబు తనకు తెలియకుండా రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విజయవాడలో జరిగిన ఒక […]

కామెడీలోనూ రెండు పెగ్గుల సిద్ధాంతమేనా? వాళ్లు ఏమైపోవాలి బాబు గారు...
X

రెండు కళ్ల సిద్ధాంతానికి చంద్రబాబును పితామహుడిగా అభివర్ణిస్తుంటాయి ప్రతిపక్షాలు. తెలంగాణకు వెళ్లి ప్రత్యేక రాష్ట్రం తన లేఖ వల్లే వచ్చిందని చెప్పడం, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి కాంగ్రెస్‌, వైసీపీ కలిసి కుట్రపూరితంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశాయని చంద్రబాబు ఆరోపించడంతో ఆయనకు రెండు కళ్ల సిద్ధాంత సృష్టికర్తగా పేరొచ్చింది. రాష్ట్ర విభజన లాంటి సీరియస్ అంశాల్లోనే కాదు కామెడీ చేసేటప్పుడు కూడా చంద్రబాబు తనకు తెలియకుండా రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు రోజూ సాయంత్రం రెండు పెగ్గులు(లిక్కర్‌) తాగి, సాయంత్రం కాసేపు పేకాట ఆడితే మనసుకు బాగుంటుందని సూచించారు. పెగ్గు వేయడం వల్ల రాత్రి నిద్ర బాగా పడుతుందని బహిరంగ వేదికపైనే చెప్పి అందరూ కంగుతినేలా చేశారు చంద్రబాబు.

అయితే శుక్రవారం విశాఖ జిల్లా పరవాడలో జరిగిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ ఒక దంపతులతో సరదాగా ముచ్చటించారు ”ఏంటమ్మా మీ ఆయన మందు తాగడా… పెద్దమనిషేనా… బుద్ధిగా ఉంటాడా.. మంచిగా చూసుకుంటాడా.. మీకుటుంబంలో వారంతా గొడవలు పడకుండా ఉంటారా” అని చంద్రబాబు మహిళను సరదాగా ప్రశ్నించారు. ”ఇల్లు కూడా నీ పేరు మీదే పెట్టాను. పది లక్షల ఆస్తి నీ పేరు మీద ఉంది. ఇళ్లన్నీ మహిళల పేరు మీదే ఇస్తాం. భర్తలు తాగి వస్తే బయటకు గెంటేయండి” అని నవ్వుతూ పిలుపునిచ్చారు. అయినా మీరే కదా బాబుగారు కొన్ని నెలల క్రితమే రోజూ సాయంత్రం రెండు పెగ్గులు వేస్తే బాగా నిద్రపడుతుందని చెప్పారు. పేకాట ఆడి ఎంజాయ్ చేయండి అన్నారు. ఇప్పుడు మీరే మందు తాగిన వారిని ఇంటి నుంచి గెంటేయండి అని పిలుపునిస్తే ట్యాక్స్ పేయర్లు ఏమైపోవాలి?. దిస్‌ ఈస్ వెరీ దారుణం బాబు గారు!.

Click on Image to Read: kottapalli-geetha

mlc-satish-reddy

chandrababu-naidu-vote-for-note-case

First Published:  23 Sep 2016 11:25 AM GMT
Next Story