Telugu Global
NEWS

ఓనం మాదిరిగా తెలంగాణ బ‌తుక‌మ్మ‌!

ఈఏడాది బ‌తుక‌మ్మ‌ను ధూమ్‌.. ధామ్‌గా నిర్వ‌హించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. బ‌తుక‌మ్మ పండ‌గ‌ను ప్ర‌త్యేకంగా జ‌రిపేందుకు 15వేల మంది మ‌హిళ‌ల‌కు డ్రెస్‌కోడ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బ‌తుక‌మ్మ నిధులను రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల‌కు పెంచింది.  కేర‌ళ‌లో ఓనం పండుగ సంద‌ర్భంగా మ‌హిళ‌లు ప్ర‌త్యేక‌మైన డ్రెస్‌లు ధ‌రించి క‌నువిందుగా క‌నిపిస్తారు. తిరువ‌నంత‌పురంలో జ‌రిగి ఓనమ్ పండగ‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఒకేర‌క‌మైన చీర‌లు ధ‌రించిన కేర‌ళ మ‌హిళ‌లు ఒకే చోట చేరి […]

ఓనం మాదిరిగా తెలంగాణ బ‌తుక‌మ్మ‌!
X
ఈఏడాది బ‌తుక‌మ్మ‌ను ధూమ్‌.. ధామ్‌గా నిర్వ‌హించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. బ‌తుక‌మ్మ పండ‌గ‌ను ప్ర‌త్యేకంగా జ‌రిపేందుకు 15వేల మంది మ‌హిళ‌ల‌కు డ్రెస్‌కోడ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బ‌తుక‌మ్మ నిధులను రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల‌కు పెంచింది. కేర‌ళ‌లో ఓనం పండుగ సంద‌ర్భంగా మ‌హిళ‌లు ప్ర‌త్యేక‌మైన డ్రెస్‌లు ధ‌రించి క‌నువిందుగా క‌నిపిస్తారు. తిరువ‌నంత‌పురంలో జ‌రిగి ఓనమ్ పండగ‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఒకేర‌క‌మైన చీర‌లు ధ‌రించిన కేర‌ళ మ‌హిళ‌లు ఒకే చోట చేరి ఉత్స‌వాల్లో పాల్గొంటారు. ఈ ఉత్స‌వం చూసేందుకు రెండు క‌నులు చాల‌వు. అందుకే, ఈ వేడుక‌లను చూసేందుకు ఇత‌ర ప్రాంతాలు, విదేశాల నుంచి కూడా ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. ఈ వేడుకను స్పూర్తిగా తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం. తెలంగాణ‌లో మ‌హిళ‌లు పెద్ద‌పండుగ‌గా జ‌ర‌పుకునే బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు కూడా ప్ర‌త్యేక డ్రెస్ కోడ్ రూపొందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఎల్‌బీ స్టేడియ‌లో నిర్వ‌హించే బ‌తుక‌మ్మ వేడ‌కల‌కు దాదాపు 10 వేల‌మంది మ‌హిళ‌లు క‌లిసి ఒకే డ్రెస్‌కోడ్ చీర‌ల‌తో బ‌తుక‌మ్మ ఆడనున్నారు. ఈ దృశ్యం ద్వారా తెలంగాణ పండుగ విశిష్ట‌త‌ను చాటి చెప్ప‌డంతోపాటు ఈ పండుగ‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకురావాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది.
First Published:  22 Sep 2016 9:35 PM GMT
Next Story