ఫిరాయింపు ఎమ్మెల్యే కుమారుడిపై రేప్‌ కేసు

మరో టీడీపీ నేత కుమారుడి ఘన కార్యం వెలుగులోకి వచ్చింది. రావెల కిషోర్‌బాబు ఒక తనయుడు మహిళా టీచర్‌తో, మరో కుమారుడు అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడిన సంఘటనలు మరవకముందే తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారుడు ఒక యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకుని, మోసం చేశారంటూ సుబ్బారావు కుమారుడు రాజాబాబుపై ఒక గిరిజన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పవరం పీఎస్‌లో కేసు నమోదు అయింది. రాజాబాబుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేప్ కేసు కూడా నమోదు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం గిరిజన యువతిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఎప్పటిలాగే రంగప్రవేశం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కుమారుడిని కాపాడేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నారని బాధితురాలి కుటుంటసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరుపుల సుబ్బారావు కొన్ని నెలల క్రితమే జ్యోతుల నెహ్రుతో కలిసి వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు.

Click on Image to Read:

mlc-satish-reddy

chandrababu-naidu-vote-for-note-case

nimmagadda-prasad

nama-nageswara-rao