సుజనా, రమేష్‌ల గురించి కొత్త విషయాలు చెప్పిన సీనియర్ సిటిజన్

ఈ మధ్య పార్టీలు, పత్రికల కంటే సాధారణ జనమే ప్రభుత్వ వ్యవహారాలను, నేతల పోకడలను ఎక్కువగా గమనిస్తూ వారు చేసే పనులను బయటపెడుతున్నట్టుగా ఉంది. తాజాగా సాక్షి టీవీ గుంటూరులో నిర్వహించిన చైతన్యపథం కార్యక్రమంలో రత్నబోస్ అనే సీనియర్ సిటిజన్‌ కేంద్రమంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిని తాను నిరూపించేందుకు కూడా సిద్దమని చాలెంజ్ చేశారు. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం లేదంటున్న సుజనా చౌదరి మరి హిమాచల్ ప్రదేశ్‌లో ఇండస్ట్రీయల్ కారిడార్‌ ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చిన తర్వాతే ఆ రాయితీలను సొంతం చేసుకునేందుకు సుజనాచౌదరి అక్కడికి వెళ్లి పరిశ్రమలు పెట్టారని రత్నబోస్ చెప్పారు. సుజనాచౌదరి గురించి తనకు బాగా తెలుసని వెల్లడించారు.

మరో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ కూడా హిమాచల్ ప్రదేశ్‌లో పవర్ ప్లాంట్ నెలకొల్పారని ఆయన చెప్పారు. కేవలం హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఉండడం, పరిశ్రమల ఏర్పాటులో రాయితీలు వస్తుండడం వల్లే వారిద్దరూ అక్కడికి వెళ్లి పరిశ్రమలు పెట్టారని రత్నబోస్ చెప్పారు. దీనిపై అక్కడే ఉన్న టీడీపీనేతలను ప్రశ్నించగా వారి నోట మాట రాలేదు. తాను ఈ విషయాలు ఆధారాలు లేకుండా చెప్పడం లేదని… కావాలంటే సుజనా, సీఎం రమేష్‌కు హిమాచల్ ప్రదేశ్‌లో పరిశ్రమలు ఉన్న విషయాన్ని నిరూపిస్తానని రత్నబోస్ సవాల్ చేశారు. సుజనాచౌదరి తన పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌ ఉందన్న ధైర్యంతోనే ఏపీకి హోదా అక్కర్లేదంటున్నారని మండిపడ్డారు. గతంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని ఏళ్ల తరబడి పోరాటం చేస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్‌ సాధ్యమైందని ఇప్పుడు కూడా హోదా కోసం పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

Click on Image to Read:

mlc-satish-reddy

chandrababu-naidu-vote-for-note-case

nimmagadda-prasad