ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

చంద్రబాబు ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై పిటిషన్‌ను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇది వరకే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై ప్రమేయంపై విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశించింది. అయితే చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించి విచారణపై స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లోగా పిటిషన్‌ను పరిష్కరించాలని ఆదేశించింది. ఓటుకు నోటు కేసు విచారణపై ఇదివరకు హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే ఇవ్వగా… దాన్ని నాలుగు వారాలకు సుప్రీం తగ్గించేసింది. నాలుగువారాల్లోగా పిటిషన్‌ను పరిష్కరించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. ఒకవేళ నాలుగు వారాల్లోగా హైకోర్టు నిర్ణయం తీసుకోకపోతే తిరిగి తమను ఆశ్రయించాలని పిటిషనర్ కు సుప్రీం కోర్టు సూచించింది.

Click on Image to Read:

mlc-satish-reddy

deccan-chronicle-chief-krishna-rao

ys-jagan1