బయటపడ్డ నిమ్మగడ్డ అడ్డా

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు సంబంధించి మరో అంశం వెలుగులోకి వచ్చింది. పనామా పేపర్స్‌ తరహాలోనే “ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌” (ఐసీఐజే) సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. బహమాస్ లీక్స్‌ పేరుతో పన్ను ఎగవేత కోసం విదేశాల్లో కంపెనీలు స్థాపించిన వారి వివరాలు బయటపెట్టింది. జర్మనీ వార్తాపత్రిక సడుట్చే జైటుంగ్‌, భారత్‌లోని న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు మీడియా భాగస్వాములతో కలిసి బహమాస్‌ దేశంలో నమోదైన 1,75,000 కంపెనీలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్లు, వ్యక్తుల ఆస్తుల వివరాలను విడుదల చేసింది.కరీబియన్‌లో పన్ను ఎగువేతదారులకు అనువైన దేశంగా పేరున్న బహమాస్‌లో చాలా మంది అక్రమ సొమ్ము దాచినట్టు వెల్లడించింది. ఈ బహమాస్‌ లీక్స్‌ జాబితాలో భారత కార్పొరేట్‌ రంగంతో సంబంధం ఉన్న 475 సంస్థలున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌, బారన్‌ గ్రూప్‌ అధినేత కబీర్‌ మూల్‌చందానీ, ఫ్యాషన్‌ టీవీ ఇండియా ప్రమోటర్‌ రాజన్‌ మధు, ప్రీమియం ఫిన్నిష్‌ వాటర్‌ బ్రాండ్‌ చైర్మన్‌ అమన్‌ గుప్తా, గుర్జీత థిల్లాన్‌, హర్‌భజన్‌ కౌర్‌, మైరా డిలోరస్‌ రెగో, అశోక్‌ చావ్లా సహా ఇంకా ప్రముఖ వ్యక్తులు ఉన్నట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కథనంలో వెల్లడించింది.

నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన సోదరుడు కలిసి బహమాస్‌లో పదికి పైగా కంపెనీలను స్థాపించారు. క్రిస్టల్‌ లేక్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ఎల్‌సి, బెస్ట్‌ స్కైలైన్‌ ఇంక్‌, రౌగ్‌మోంట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ కంపెనీలకు ప్రసాద్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2011 జనవరిలో క్రిస్టల్‌ లేక్‌, రౌగ్‌మోంట్‌ హోల్డింగ్స్‌ కంపెనీలకు నిమ్మగడ్డ రాజీనామా చేశారు. 2000కు ముందు తొలుత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిన నిమ్మగడ్డ అనంతరం… నష్టాల్లో ఉన్న హెర్రెన్‌ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి దాన్ని మ్యాట్రిక్స్‌ ఫార్మాసిటికల్స్‌గా పేరు మార్చి లాభాలబాట పట్టించారు. అనంతరం ఆ కంపెనీని అమెరికాకు చెందిన మరోకంపెనీకి విక్రయించి భారీగా లాభాలు సంపాదించారు. ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు చేపట్టారు.

Click on Image to Read:

mlc-satish-reddy

deccan-chronicle-chief-krishna-rao

ys-jagan1