ఎన్‌ఆర్‌ఐలతో జగన్ లైవ్ ఇంట్రాక్షన్

ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే రాష్ట్రంలో పోరాటం చేస్తూ వరుసగా యువభేరి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 25 ఆదివారం ఆన్‌లైన్‌లో ఎన్‌ఆర్‌ఐలతో ఇంట్రాక్ట్ కాబోతున్నారు. రాత్రి 8.30 నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఎన్‌ఆర్‌ఐలతో జగన్ “లైక్‌ ఇంట్రాక్షన్‌” కార్యక్రమాన్ని యూట్యూబ్‌ ఛానల్ ద్వారా వీక్షించవచ్చని ఎన్‌ఆర్‌ఐ వైసీపీ విభాగం వెల్లడించింది. హోదా సాధనకు విదేశాల్లో ఉన్న తెలుగువారి మద్దతు కూడా అవసరమన్నది జగన్‌ ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐల నుంచి సలహాలు సూచనలు కూడా జగన్ స్వీకరిస్తారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా హోదాకోసం గట్టిగా డిమాండ్ చేస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తాయని వైఎస్‌ఆర్‌సీపి భావిస్తోంది.

Click on Image to Read: 

mlc-satish-reddy

chandrababu-naidu-vote-for-note-case

kottapalli-geetha