Telugu Global
Cinema & Entertainment

సెట్ రెడీ... చిందేయడమే ఆలస్యం...

చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ మేటర్ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. త్వరలోన రామోజీ ఫిలింసిటీలో సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. అది కూడా అలాంటిఇలాంటి షెడ్యూల్ కాదు. అదిరిపోయే ఐటెంసాంగ్ షెడ్యూల్. అవును… మాస్ స్టెప్పులకు మారుపేరుగా నిలిచిన చిరంజీవి… తన 150వ సినిమా ఖైదీ నంబర్-150లో అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నాడు. హీరోయిన్ క్యాథరీన్ తో కలిసి చిరు చిందేయబోతున్నాడు. దీనికి […]

సెట్ రెడీ... చిందేయడమే ఆలస్యం...
X

చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ మేటర్ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. త్వరలోన రామోజీ ఫిలింసిటీలో సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. అది కూడా అలాంటిఇలాంటి షెడ్యూల్ కాదు. అదిరిపోయే ఐటెంసాంగ్ షెడ్యూల్. అవును… మాస్ స్టెప్పులకు మారుపేరుగా నిలిచిన చిరంజీవి… తన 150వ సినిమా ఖైదీ నంబర్-150లో అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నాడు. హీరోయిన్ క్యాథరీన్ తో కలిసి చిరు చిందేయబోతున్నాడు. దీనికి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో దాదాపు కోటి రూపాయల ఖరీదైన సెట్ సిద్ధమైపోయింది. వచ్చేనెల మొదటివారంలో ఈ సాంగ్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఐటెంసాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దేవిశ్రీప్రసాద్… దాదాపు 2 నెలల టైం తీసుకొని చిరంజీవి కోసం ఓ కత్తిలాంటి ఐటెంసాంగ్ సిద్ధంచేశాడని తెలుస్తోంది. ఓ 2 రోజుల కిందటే ఈ ఐటెంసాంగ్ రికార్డింగ్ కూడా పూర్తిచేశాడు. ఈ పాటతో మరో బాలీవుడ్ సింగర్ ను తెలుగుతెరకు పరిచయం చేస్తున్నాడు దేవిశ్రీప్రసాద్. చిరంజీవి 150వ సినిమా ఒక ఎత్తయితే.. ఈ ఐటెంసాంగ్ మరో ఎత్తు. లారెన్స్ ఈ ఐటెంసాంగ్ కు కొరియోగ్రాఫర్ గా పనిచేయబోతున్నాడు.

First Published:  24 Sep 2016 7:54 AM GMT
Next Story