Telugu Global
NEWS

పాక్‌ ప్రజలకు శాంతిసందేశం పంపిన మోదీ

మన దేశాన్ని పాక్ ఉగ్రమూకలు చాలాఏళ్లుగా దొంగదెబ్బలు తీస్తూనే ఉన్నాయి. గతంలో యూపీఏ హయాంలోనూ అలాంటి సంఘటనలు జరిగాయి. ఆసమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంపై బీజేపీ నేతలు పెద్దెత్తున విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ నేతల చేతగానితనం వల్లే పాకిస్తాన్‌ రెచ్చిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా పాకిస్తాన్‌ వక్రబుద్ది మారలేదు. ఉరిలో సైనిక కార్యాలయంపై దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు పాక్ ఉగ్రవాదులు. దీంతో పాకిస్తాన్‌కు గట్టి జవాబు […]

పాక్‌ ప్రజలకు శాంతిసందేశం పంపిన మోదీ
X

మన దేశాన్ని పాక్ ఉగ్రమూకలు చాలాఏళ్లుగా దొంగదెబ్బలు తీస్తూనే ఉన్నాయి. గతంలో యూపీఏ హయాంలోనూ అలాంటి సంఘటనలు జరిగాయి. ఆసమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంపై బీజేపీ నేతలు పెద్దెత్తున విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ నేతల చేతగానితనం వల్లే పాకిస్తాన్‌ రెచ్చిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా పాకిస్తాన్‌ వక్రబుద్ది మారలేదు. ఉరిలో సైనిక కార్యాలయంపై దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు పాక్ ఉగ్రవాదులు. దీంతో పాకిస్తాన్‌కు గట్టి జవాబు చెప్పాలన్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేరళలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ… పాక్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పాక్‌ ప్రజలకు శాంతి సూచనలు చేశారు. ‘పాకిస్థాన్ ప్రజలారా.. ఇండియా గడ్డ నుంచి మీతో మాట్లాడుతున్నా.. చరిత్ర మొదలు 1947 వరకు మీ పూర్వీకులు ఇక్కడి నేలకు నమస్కరించినవారేనని గుర్తుంచుకోండి. విడిపోయిన తర్వాత మీ పాలకులు ఏ విధంగా మారిపోయారో గమనించండి. గడిచిన కొద్ది నెలల్లో ఒక్క కశ్మీర్ లోనే 110 మంది టెర్రరిస్టులు చనిపోయారు. వీళ్లందరూ ఎవరి బిడ్డలు? ప్రస్తుతం భారత్ నుంచి అన్ని దేశాలకు ఇంజనీర్లను పంపుతున్నాం. కానీ మీ దేశం ఉగ్రవాదులను పంపుతోంది. పాక్ అన్నదమ్ములారా.. మీతో కలిసి యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. రండి.. పేదరికంపై, ఆకలిదప్పులపై యుద్ధం చేద్దాం. అప్పుడు పాకిస్థాన్, ఇండియాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం..’ అని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదులూ చెవులు రెక్కించి వినండి.. ఉరి ఘటనను మేం మర్చిపోం అని ఆవేశపూరితంగా మాట్లాడారు. 21 శతాబ్దంలో అద్భుతాలు సాధించాలని ఆసియా దేశాలు కలలు కంటున్నాయి… ఒక్క పాకిస్తాన్‌ తప్పఅని మోదీ విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌ వల్ల భారత్‌ ఒక్కటే కాకుండా ఆసియా దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయన్నారు. పాకిస్తాన్‌కు తాను గట్టిగా చెబుతున్నానని ఇకపై పీవోకే, బలూచ్‌లలో ఆ దేశం ఆటలు సాగవన్నారు మోదీ.

Click on Image to Read:

mla-alla-ramakrishna-reddy

chandrababu-phd

ysrcp-mlas

First Published:  24 Sep 2016 12:04 PM GMT
Next Story