Telugu Global
International

భార‌త్‌తో యుద్ధానికి పాక్ స‌న్నాహాలు!

మ‌న‌దేశంలోకి ఉగ్ర‌మూక‌ల్ని ఉసిగొల్పిన పాకిస్తాన్ భార‌త్ ను మ‌రింత రెచ్చ‌గొడుతోంది. ప్ర‌స్తుతం పాకిస్తాన్ హైవేల‌ను ర‌న్‌వేలుగా చేసుకుని ఎఫ్‌-16 యుద్ధ‌విమానాలు గ‌గ‌న‌వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటి శ‌బ్దాల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు నిజంగానే యుద్ధం వ‌చ్చిందేమోన‌న్న భ‌యంతో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. దీనిపై పాకిస్తాన్ సైనికాధికారులు స్పందించారు. పొరుగుదేశంతో నెల‌కొన్న వైరం నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు ఎదురైనా సిద్ధంగా ఉండాల‌న్న ఉద్దేశంతోనే ఇలా రిహార్సల్స్ చేస్తున్నామ‌ని చెబుతున్నారు. దీనిపై పాక్ విలేక‌రులు మాత్రం భిన్నంగా స్పందించారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు యుద్ధాన్ని […]

భార‌త్‌తో యుద్ధానికి పాక్ స‌న్నాహాలు!
X
మ‌న‌దేశంలోకి ఉగ్ర‌మూక‌ల్ని ఉసిగొల్పిన పాకిస్తాన్ భార‌త్ ను మ‌రింత రెచ్చ‌గొడుతోంది. ప్ర‌స్తుతం పాకిస్తాన్ హైవేల‌ను ర‌న్‌వేలుగా చేసుకుని ఎఫ్‌-16 యుద్ధ‌విమానాలు గ‌గ‌న‌వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటి శ‌బ్దాల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు నిజంగానే యుద్ధం వ‌చ్చిందేమోన‌న్న భ‌యంతో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. దీనిపై పాకిస్తాన్ సైనికాధికారులు స్పందించారు. పొరుగుదేశంతో నెల‌కొన్న వైరం నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు ఎదురైనా సిద్ధంగా ఉండాల‌న్న ఉద్దేశంతోనే ఇలా రిహార్సల్స్ చేస్తున్నామ‌ని చెబుతున్నారు. దీనిపై పాక్ విలేక‌రులు మాత్రం భిన్నంగా స్పందించారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు యుద్ధాన్ని కోరుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. కానీ, పాక్ ప్ర‌ధాని మాత్రం యుద్ధానికి సిద్ధ‌మైన‌ట్లే క‌నిపిస్తోంద‌ని పాక్ న్యూస్ ఛాన‌ల్స్ విలేక‌రులు ట్వీట్లు చేస్తున్నారు. ఉరీ ఉగ్ర‌దాడి విష‌యంలో పాకిస్తాన్‌ను అంత‌ర్జాతీయ స‌మాజం వెలివేసినంత ప‌ని చేసింది. అమెరికా ప్ర‌జాప్ర‌తినిధులు ఏకంగా పాకిస్తాన్ ఓ ఉగ్ర‌దేశ‌మ‌ని, దానికి సైనిక సాయాన్ని ఆపాల‌ని బిల్లు కూడా ప్ర‌వేశ పెట్టారు. దీంతో పాకిస్తాన్ దిక్కుతోచ‌ని దేశంలా త‌యారైంది. ఎప్పుడూ రాసుకుపూసుకు తిరిగే ఆప్త‌మిత్రుడు చైనా కూడా.. ఈ విష‌యంలో పాకిస్తాన్‌ను వెన‌కేసుకు రాలేక‌పోయింది. అందుకే, తాను చెడ్డ కోతి వ‌న‌మంతా చెడిచింద‌న్న‌ట్లుగా.. ఇండియాను ఇలాంటి క‌వ్వింపు చ‌ర్య‌ల‌తోనైనా రెచ్చ‌గొట్టి అంత‌ర్జాతీయంగా బద్నాం చేసే దిగ‌జారుడు కుట్ర‌ల‌కు పాల్ప‌డుతోంది.
First Published:  23 Sep 2016 11:45 PM GMT
Next Story