ఎంపీ రాయపాటి మేనకోడలి అరెస్ట్

నర్సరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మేనకోడలు అరెస్ట్ అయ్యారు. చెక్‌ బౌన్స్‌ కేసులో ఆమెను రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ రాయపాటి మేనకోడలైన గుంటూరుకు చెందిన పులవర్తి విజయలక్ష్మి రాజమండ్రిలోని షాడే గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన 15వేల గజాల స్థలాన్ని 49ఏళ్లకు గాను సక్కా విల్సన్ అనే వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. ఇందుకు గాను 75లక్షలు చెల్లించాల్సి ఉంది. 2011న రూ. 47లక్షలకు చెక్‌ ఇచ్చారు విజయలక్ష్మి. అయితే ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో ఆమెపై విల్సన్ 2011లో రాజమండ్రి మూడో అదనపు సెషన్స్ కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆమెను స్థానిక షెల్టాన్‌ హోటల్‌ వద్ద శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

Click on Image to Read: 

ysrcp-mlas

mlc-satish-reddy

kottapalli-geetha