50 రోజుల్లో 20కోట్లు….

ఎట్టకేలకు కమర్షియల్ హీరో అనిపించుకున్నాడు అల్లు శిరీష్. దర్శకుడు పరశురాం చలవతో శ్రీరస్తు-శుభమస్తు సినిమాతో ఓ మంచి సక్సెస్ అందుకున్నాడు. గతంలో నారా రోహిత్ కు సోలోతో హిట్ ఇచ్చినట్టుగానే…ఈసారి అల్లు శిరీష్ కెరీర్ కు శ్రీరస్తు-శుభమస్తు పలికాడు పరశురాం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై లావిష్ గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా 50రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఎప్పుడు తన సినిమా విజయాల్ని డబ్బులతో మాత్రమే కొలిచే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. చిన్న కొడుకు సినిమాకు కూడా లెక్కలు విడుదల చేశాడు. శ్రీరస్తు-శుభమస్తు సినిమా 50 రోజుల్లో 20కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని ప్రకటించాడు. అత్యధికంగా నైజాంలో, ఊహించని విధంగా విశాఖలో ఈ సినిమాకు డబ్బులు వచ్చాయని ఎనౌన్స్ చేశాడు. ఇదే ఊపులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరశురాంకు మరో ఛాన్స్ ఇస్తున్నట్టు కూడా అల్లు అరవింద్ ప్రకటించడం విశేషం. మొత్తానికి తాజా విజయంలో అల్లు శిరీష్ పండగ చేసుకుంటున్నాడు. నెక్ట్స్ సినిమా ఎవరితో అనే విషయాన్ని ఇంకా పక్కా చేయలేదు. కొన్నాళ్లు ఎంజాయ్ చేసిన తర్వాత, నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయబోతున్నాడు.