Telugu Global
Cinema & Entertainment

రామ్ నెక్ట్స్ సినిమా అదేనా...?

ప్రస్తుతం హైపర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు రామ్. టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమాను హైపర్ స్పీడ్ తో పూర్తిచేశాడు రామ్. ఈనెల 30న మూవీ గ్రాండ్ గా థియేటర్లలో విడుదలకాబోతోంది. ఇదిలా ఉండగా.. హైపర్ తర్వాత రామ్ చేయబోయే సినిమాపై ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ నడుస్తోంది. హైపర్ తర్వాత మరోసారి కరుణాకరన్ దర్శకత్వంలో నటించేందుకు రామ్ రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. స్రవంతి మూవీస్ బ్యానర్ పై కరుణ్ కరన్ డైరక్షన్ […]

రామ్ నెక్ట్స్ సినిమా అదేనా...?
X

ప్రస్తుతం హైపర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు రామ్. టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమాను హైపర్ స్పీడ్ తో పూర్తిచేశాడు రామ్. ఈనెల 30న మూవీ గ్రాండ్ గా థియేటర్లలో విడుదలకాబోతోంది. ఇదిలా ఉండగా.. హైపర్ తర్వాత రామ్ చేయబోయే సినిమాపై ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ నడుస్తోంది. హైపర్ తర్వాత మరోసారి కరుణాకరన్ దర్శకత్వంలో నటించేందుకు రామ్ రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. స్రవంతి మూవీస్ బ్యానర్ పై కరుణ్ కరన్ డైరక్షన్ లోనే రామ్ సెట్స్ పైకి వెళ్తాడనే విషయం దాదాపు పక్కా అయింది. అయితే ఇంతలోనే కిషోర్ తిరుమల అనే మరో దర్శకుడు రేసులోకి వచ్చాడు. గతంలో రామ్ కు నేను శైలజ రూపంలో మంచి హిట్ ఇచ్చాడు కిషోర్ తిరుమల. ఆ సినిమా సక్సెస్ తర్వాత వెంకీతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే వెంకీ మాత్రం కిషోర్ తిరుమలను వెయిటింగ్ లో పెట్టి.. గురు అనే సినిమాను స్టార్ట్ చేశాడు. కిషోర్ తిరుమల మూవీ స్టార్ట్ అవ్వడానికి కనీసం ఇంకో 3-4 నెలలైనా పడుతుంది. ఈ గ్యాప్ లో కుదిరితే రామ్ తో మరో మూవీ ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట కిషోర్ తిరుమల. ఇదే విషయాన్ని రామ్ తో కూడా డిస్కస్ చేశాడట. ఈ వార్తలో నిజం ఎంతనేది త్వరలోనే రామ్ ప్రకటన ద్వారా తేలిపోనుంది.

First Published:  24 Sep 2016 7:37 AM GMT
Next Story