Telugu Global
International

భార‌త్ యుద్ధానికి దిగితే... పాక్ కే మా మ‌ద్ద‌తు!

ఉరి సైనిక శిబిరంపై ఉగ్ర‌మూక‌ల దాడి త‌రువాత భార‌త్‌- పాక్ మ‌ధ్య యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్నాయి. ఈ నేప‌థ్యంలో బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన పొరుగుదేశం చైనా వివాదాన్ని మ‌రింత పెద్ద‌ది చేసేలా మాట‌ల మంట పెడుతోంది. పాకిస్తాన్‌పై భార‌త్ ఆక‌స్మిక యుద్ధానికి దిగితే.. తాము పాకిస్తాన్ కు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించింద‌ని పాకిస్తాన్ మీడియా వెల్ల‌డించింది.  18 మంది భార‌త సైనికుల్నిపొట్ట‌న పెట్టుకున్న ఉరి ఉగ్ర‌దాడి త‌రువాత దాయాది దేశంతో సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ దాడి త‌రువాత దౌత్య‌ప‌రంగా […]

భార‌త్ యుద్ధానికి దిగితే... పాక్ కే మా మ‌ద్ద‌తు!
X
ఉరి సైనిక శిబిరంపై ఉగ్ర‌మూక‌ల దాడి త‌రువాత భార‌త్‌- పాక్ మ‌ధ్య యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్నాయి. ఈ నేప‌థ్యంలో బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన పొరుగుదేశం చైనా వివాదాన్ని మ‌రింత పెద్ద‌ది చేసేలా మాట‌ల మంట పెడుతోంది. పాకిస్తాన్‌పై భార‌త్ ఆక‌స్మిక యుద్ధానికి దిగితే.. తాము పాకిస్తాన్ కు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించింద‌ని పాకిస్తాన్ మీడియా వెల్ల‌డించింది.
18 మంది భార‌త సైనికుల్నిపొట్ట‌న పెట్టుకున్న ఉరి ఉగ్ర‌దాడి త‌రువాత దాయాది దేశంతో సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ దాడి త‌రువాత దౌత్య‌ప‌రంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేయాల‌ని భార‌త్ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాల‌నిస్తున్నాయి. అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్ ఇలా అగ్ర‌రాజ్యాలు పాకిస్తాన్ తీరును త‌ప్పుబ‌డుతూ భార‌త్‌కు బాస‌ట‌గా నిలిచాయి. పాకిస్తాన్‌కు అందిస్తోన్న సైనిక‌సాయాన్ని నిలిపివేయాల‌ని, బిన్‌లాడెన్‌, దావూద్ ఇబ్ర‌హీం లాంటి ఉగ్ర‌వాదుల‌కు ఆ దేశం భూత‌ల స్వ‌ర్గంగా మారిందని, ఆదేశాన్ని ఉగ్ర‌వాద దేశంగా ప్ర‌క‌టించాల‌ని సాక్ష‌త్తూ అమెరికా ప్ర‌జాప్ర‌తినిధులు ఓ బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. నిత్యం పాకిస్తాన్‌ను వెన‌కేసుకొచ్చే పొరుగుదేశం చైనా కూడా చేసేదిలేక ఉరి దాడిని ఖండించింది. దీంతో పాకిస్తాన్ కు దిక్కుతోచ‌ని ప‌రిస్థితి ఎదురైంది.
ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్‌లోని ప్ర‌ముఖ మీడియా సంస్థ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. పాకిస్తాన్ పై ఏ దేశ‌మైనా ఆక్ర‌మ‌ణ‌కు లేదా యుద్ధానికి దిగితే.. పాకిస్తాన్‌కే మా మ‌ద్ద‌తు ఉంటుంది. క‌శ్మీర్ విష‌యంలో ఇప్ప‌టికీ మేము పాకిస్తాన్ వాద‌న‌నే స‌మ‌ర్థిస్తున్నాం అంటూ లాహోర్‌లోని చైనా రాయ‌బారి యు బోరెన్ తెలిపారంటూ పంజాబ్ సీఎం ఆఫీసు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ విష‌యాన్ని పాక్ జాతీయ‌ దిన‌ప‌త్రిక‌ డాన్ ప్ర‌ముఖంగా పేర్కొంది. ఈ ప్ర‌చారంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పాక్‌కు త‌న‌కు లేని మ‌ద్ద‌తును ఉన్న‌ట్లుగా చూపించి మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చైనా, పాకిస్తాన్ రెండూ క‌శ్మీర్ భూభాగాన్ని ఆక్ర‌మించాయి కాబ‌ట్టి ఈ దేశాల స్నేహంలో ఆశ్చ‌ర్యమేమీ లేద‌ని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు.
First Published:  24 Sep 2016 9:00 PM GMT
Next Story