Telugu Global
Cinema & Entertainment

పవన్ మరదలు ఎవరో తెలిసిపోయింది...

ఈరోజు నుంచి పవన్ సెట్స్ పైకి వచ్చాడు. ఇప్పటికే ప్రారంభమైన కాటమరాయుడు సినిమా షూటింగ్ లోకి ఈరోజు నుంచి పవన్ జాయిన్ అయ్యాడు. పవన్ పై కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు కొనసాగుతుంది. షెడ్యూల్ లో భాగంగా హీరో, అతడి మరదలు మధ్య వచ్చే ఫన్నీ సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇందులో పవన్ తో పాటు మానస హిమవర్ష అనే అమ్మాయి నటించింది. ఈ సినిమాలో పవన్ కు మరదలిగా మానస హిమవర్ష […]

పవన్ మరదలు ఎవరో తెలిసిపోయింది...
X

ఈరోజు నుంచి పవన్ సెట్స్ పైకి వచ్చాడు. ఇప్పటికే ప్రారంభమైన కాటమరాయుడు సినిమా షూటింగ్ లోకి ఈరోజు నుంచి పవన్ జాయిన్ అయ్యాడు. పవన్ పై కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు కొనసాగుతుంది. షెడ్యూల్ లో భాగంగా హీరో, అతడి మరదలు మధ్య వచ్చే ఫన్నీ సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇందులో పవన్ తో పాటు మానస హిమవర్ష అనే అమ్మాయి నటించింది. ఈ సినిమాలో పవన్ కు మరదలిగా మానస హిమవర్ష నటిస్తోంది. రొమాన్స్ అనే సినిమాతో ఈ అమ్మాయి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా పవన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని మానస స్వయంగా తన సోషల్ మీడియా పేజ్ లో వెల్లడించింది. సినిమా అవకాశం ఎలా వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. ఈ కథ కోసం మాసను అసలు ఆడిషన్ చేయలేదట. నెట్ లో మానస ఫొటోలు చూసిన దర్శకుడు డాలీ… ఎలాంటి ఆడిషన్స్ లేకుండానే పవన్ మరదలి పాత్ర కోసం మానసను సెలక్ట్ చేశాడట. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే.. కాటమరాయుడికి చెందిన నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని వెల్లడిస్తారు.

Click on Image to Read:

pawan-brother

First Published:  24 Sep 2016 10:07 PM GMT
Next Story