Telugu Global
NEWS

గులాబీ పార్టీలోకి అల‌నాటి హీరోయిన్‌! 

బాపు దృశ్య‌కావ్యం ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ సంగీత గుర్తుంది క‌దా! ద‌క్షిణ భార‌త‌దేశంలోని దాదాపు అన్ని భాష‌ల్లోనూ ఆమె న‌టించారు. దాదాపు 600 సినిమాల్లో హీరోయిన్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చ‌క్క‌టి గుర్తింపు సాధించారు. ఇప్పుడు సంగీత రాజ‌కీయాల్లోకి రానున్నారు. ఆమె సొంతూరు వ‌రంగ‌ల్‌. అందుకే ఆమె అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. పుట్టిపెరిగింది వ‌రంగ‌ల్‌లోనే అయినా.. వృత్తిరీత్యా స్థిర‌ప‌డింది మాత్రం చెన్నైలో. మాతృభూమిని వ‌దిలివ‌చ్చాన‌న్న ఫీలింగ్ చాలాకాలంగా ఉంద‌ని, అందుకే త్వ‌ర‌లోనే […]

గులాబీ పార్టీలోకి అల‌నాటి హీరోయిన్‌! 
X
బాపు దృశ్య‌కావ్యం ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ సంగీత గుర్తుంది క‌దా! ద‌క్షిణ భార‌త‌దేశంలోని దాదాపు అన్ని భాష‌ల్లోనూ ఆమె న‌టించారు. దాదాపు 600 సినిమాల్లో హీరోయిన్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చ‌క్క‌టి గుర్తింపు సాధించారు. ఇప్పుడు సంగీత రాజ‌కీయాల్లోకి రానున్నారు. ఆమె సొంతూరు వ‌రంగ‌ల్‌. అందుకే ఆమె అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. పుట్టిపెరిగింది వ‌రంగ‌ల్‌లోనే అయినా.. వృత్తిరీత్యా స్థిర‌ప‌డింది మాత్రం చెన్నైలో. మాతృభూమిని వ‌దిలివ‌చ్చాన‌న్న ఫీలింగ్ చాలాకాలంగా ఉంద‌ని, అందుకే త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అవ్వాల‌నుకుంటున్న‌ట్లు సంగీత వెల్ల‌డించింది. హైద‌రాబాద్‌కు మకాం మార్చాక‌.. టీఆర్ ఎస్‌లో చేరి ప్ర‌జాసేవ‌ చేయాల‌నుకుంటున్న‌ట్లు త‌న మ‌న‌సులో మాట మీడియాతో పంచుకుంది. దీంతో అధికార పార్టీలోకి చేర‌నున్న తొలిహీరోయిన్ సంగీత‌నే కావ‌డం విశేషం.
First Published:  25 Sep 2016 12:13 AM GMT
Next Story