Telugu Global
Cinema & Entertainment

పవన్ తమ్ముడు అతడు కాదు....

పవన్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమాలో కీలకమైన పాత్ర ఉంది. పవన్ కల్యాణ్ తమ్ముడు పాత్ర అది. ఆ క్యారెక్టర్ కోసం చాలామంది పేర్లను పరిశీలిస్తున్నాడు దర్శకుడు డాలీ. కానీ ఇంతవరకు ఎవరూ సెట్ కాలేదు. అయితే తాజాగా ఆ క్యారెక్టర్ లోకి శర్వానంద్ వచ్చి చేరాడని.. పవన్ కు తమ్ముడిగా శర్వానంద్ నటించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎఁబీబీఎస్ లో శర్వానంద్ ఓ చిన్న పాత్ర పోషించాడు. […]

పవన్ తమ్ముడు అతడు కాదు....
X

పవన్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమాలో కీలకమైన పాత్ర ఉంది. పవన్ కల్యాణ్ తమ్ముడు పాత్ర అది. ఆ క్యారెక్టర్ కోసం చాలామంది పేర్లను పరిశీలిస్తున్నాడు దర్శకుడు డాలీ. కానీ ఇంతవరకు ఎవరూ సెట్ కాలేదు. అయితే తాజాగా ఆ క్యారెక్టర్ లోకి శర్వానంద్ వచ్చి చేరాడని.. పవన్ కు తమ్ముడిగా శర్వానంద్ నటించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎఁబీబీఎస్ లో శర్వానంద్ ఓ చిన్న పాత్ర పోషించాడు. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలో కూడా శర్వ కనిపించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్ని శర్వానంద్ ఖండించాడు. తనకు పవన్ సినిమాతో సంబంధం లేదని స్పష్టంచేశాడు. ఆ పాత్ర కోసం తనను ఎవరూ సంప్రదించలేదని అంటున్నాడు. ఎవరైనా తనను సంప్రదిస్తే.. అప్పుడు ఆలోచిస్తానంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో దిల్ రాజు బ్యానర్ పై శతమానం భవతి అనే సినిమా చేస్తున్నాడు. ఈమధ్యే ఎక్స్ ప్రెస్ రాజా విజయంతో తన రేంజ్ పెంచుకున్నాడు. మరి పవన్ కల్యాణ్ ఆఫర్ చేస్తే.. ఆ పాత్రను శర్వానంద్ పోషిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

First Published:  24 Sep 2016 9:49 PM GMT
Next Story