Telugu Global
NEWS

జగన్ సంచలన ప్రకటన

ప్రవాసాంధ్రులతో లైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న జగన్… హోదా కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించేందుకు సిద్ధమన్నారు. మరికొన్ని రోజులు చూసి చంద్రబాబులో మార్పు రాకపోతే మరో నాలుగు అడుగులు ముందుకేసి వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారన్నారు.  ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరుతామన్నారు. ” అరుణ్‌ జైట్లీ ప్రకటన వచ్చిన రోజే ఎంపీల చేత రాజీనామా చేయిద్దామనుకున్నాం. కానీ అలా చేస్తే కనీసం పార్లమెంట్లో వెల్‌లోకి వెళ్లి ఫైట్ […]

జగన్ సంచలన ప్రకటన
X

ప్రవాసాంధ్రులతో లైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న జగన్… హోదా కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించేందుకు సిద్ధమన్నారు. మరికొన్ని రోజులు చూసి చంద్రబాబులో మార్పు రాకపోతే మరో నాలుగు అడుగులు ముందుకేసి వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారన్నారు. ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరుతామన్నారు. ” అరుణ్‌ జైట్లీ ప్రకటన వచ్చిన రోజే ఎంపీల చేత రాజీనామా చేయిద్దామనుకున్నాం. కానీ అలా చేస్తే కనీసం పార్లమెంట్లో వెల్‌లోకి వెళ్లి ఫైట్ చేసే వారు కూడా ఉండరన్న ఉద్దేశంతోవెనక్కు తగ్గాం. కానీ చివరకు రాజీనామా బ్రహ్మాస్త్రం మాత్రం ప్రయోగించాల్సిందే. కానీ కొద్ది కాలం వివిధ రూపాల్లో పోరాటం చేస్తాం. ఎలా పోరాటం చేయాలన్నది అందరి నుంచి సలహాలు తీసుకుంటాం. కమ్యూనిస్టులతో కలిసి కూడా మాట్లాడుతున్నాం . ఏదో ఒక రోజు మాత్రం రాజీనామా బ్రహ్మాస్త్రం మాత్రం ప్రయోగిస్తాం” అని జగన్ చెప్పారు. హోదాపై పోరాటం మాత్రం ఆపేది లేదన్నారు.

”దేవుడు చంద్రబాబును సీఎం చేశాడు. నన్ను ప్రతిపక్ష నేతగా ఉంచాడు. మనం సొంత లాభాల కోసం రాజీ పడిపోతే భావితరాలు మనల్ని క్షమించవు. దేవుడు ఎలా పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. జగన్‌ ఒక మాట కోసం కాంగ్రెస్‌ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాతే నాపై కేసులు పెట్టారు. మనుషులు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు. సుధీర్గ రాజకీయ జీవితంలో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు ప్రపంచంలో ఎవరూ చేయలేదు. ఒక సీఎంగా ఉన్న వ్యక్తి నల్లధనం సూట్‌కేసులను ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయి కూడా అరెస్ట్ కాలేదంటే అది కేవలం చంద్రబాబు విషయంలో మాత్రమే సాధ్యమైంది. తెలంగాణ ఎమ్మెల్యేలను, వైసీపీ ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. దొంగ పట్టుబడే వరకు తెలివైన వాడే” అని జగన్ అన్నారు.

Click on Image to Read:

ys-jagan-chandrababu-naidu-political-career

ys-jagan-pawan

First Published:  25 Sep 2016 10:07 AM GMT
Next Story