Telugu Global
National

ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందన్న రామచంద్ర గుహ

దేశంలో ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందని, మరో పదిహేను, ఇరవై ఏళ్లపాటు భారత రాజకీయాల్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అన్నారు. ఒక పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇపుడు బీజేపీ తిరుగులేని శక్తిగా ఉన్నదని, దానికి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీలేదని, ఒకటి రెండు రాష్ట్రాల్లో తప్ప దేశమంతా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. “మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఉనికే లేకుండా పోయింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మరణశయ్యమీద ఉంది. కేరళలో కమ్యూనిష్టులు, బెంగాల్‌లో […]

ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందన్న రామచంద్ర గుహ
X

దేశంలో ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందని, మరో పదిహేను, ఇరవై ఏళ్లపాటు భారత రాజకీయాల్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అన్నారు. ఒక పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇపుడు బీజేపీ తిరుగులేని శక్తిగా ఉన్నదని, దానికి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీలేదని, ఒకటి రెండు రాష్ట్రాల్లో తప్ప దేశమంతా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. “మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఉనికే లేకుండా పోయింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మరణశయ్యమీద ఉంది. కేరళలో కమ్యూనిష్టులు, బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌, తమిళనాడు ద్రవిడ పార్టీలు…. అలా రాష్ట్రాలలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందిగానీ జాతీయస్థాయిలో లేదు. 1960-70లలో కాంగ్రెస్‌లాగా ఇప్పుడు బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీగా కనిపిస్తోంది” అనిఅన్నారు.

నరేంద్రమోడీ మీద చాలామందికి ఇప్పటికే భ్రమలు తొలిగాయని, ఆయనకు ప్రత్యామ్నాయంగా నితీష్‌ కుమార్‌ను, కేజ్రీవాల్‌ను ప్రజలు భావించినా, వాళ్లు నిరాశపరుస్తున్నారని గుహ చెప్పారు.

పౌరుల భావ స్వేచ్ఛను గౌరవించే అలవాటు మోడీకి లేదని, గుజరాత్‌లో అదే చేశాడని గుహ అన్నాడు. “కాంగ్రెస్‌ కూడా దేశంలోని వ్యవస్థలను సక్రమంగా నడవనివ్వలేదు. జడ్జీలను, వైస్‌ఛాన్స్‌లర్లను…. తదితరులను తన వాళ్లను నియమించేది. ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తోంది. కానీ బీజేపీ నియామకాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో మతతత్వం పోవాలి” అని గుహ కోరారు. బీజేపీ మేధావులు లేని బలమైన పార్టీ అని, వాళ్లకున్న ఒకే ఒక మేధావి అరుణ్‌శౌరీని కూడా దూరంగా పెట్టారని అన్నాడు.

గో రక్షణ పేరుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చేస్తున్న రాజకీయాలు దేశ సాంఘీక, సాంస్కృతిక, నైతిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చర్యలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలు పోరాడుతున్నారు కానీ కాంగ్రెస్‌ పార్టీ పోరాడడంలేదని రాహుల్‌ గాంధీ రాజకీయాలను వదిలేస్తే మంచిదని, ఆయన పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడితే ఆయనకూ మంచిది, దేశానికీ మంచిదని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్‌లో చాలామంది తెలివైన వాళ్లు ఉన్నారు. అయినా కాంగ్రెస్‌ పార్టీ గాంధీ కుటుంబం మీద ఇంతగా ఎందుకు ఆధారపడుతారో అర్ధం కాదు. డబ్బుకోసమా? పర్సు వాళ్లదగ్గర ఉన్నందుకా? బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80-100 సీట్లకు మించి రావు ” అని గుహ జోస్యం చెప్పారు.

First Published:  26 Sep 2016 4:45 AM GMT
Next Story