Telugu Global
Cinema & Entertainment

పవన్ కు తమ్ముళ్లు దొరకడం లేదు...

ఒకరు కాదు.. ఇద్దరు కాదు… ఏకంగా నలుగురు తమ్ముళ్లు కావాలి. దీంతో ఆర్టిస్టులకు తెగ ఇబ్బంది అయిపోతోంది. చెల్లెళ్లు పాత్రలంటే ఎలాగోలా ఏరుకొని వచ్చేయొచ్చు. కానీ తమ్ముళ్లు అనేసరికి ఓ పట్టాన సెట్ అవ్వడం లేదు. పవన్ కాటమరాయుడి పరిస్థితి ఇది. సినిమాలో పవన్ కు నలుగురు తమ్ముళ్లు. వాళ్లలో ఒక్క కమల్ కామరాజు మాత్రమే సెట్ అయ్యాడు. మిగతా వాళ్ల కోసం సెర్చింగ్. నలుగుర్లో కీలకమైన తమ్ముడి పాత్ర కోసం శర్వానంద్ ను అనుకున్నారు. కానీ శర్వ […]

పవన్ కు తమ్ముళ్లు దొరకడం లేదు...
X

ఒకరు కాదు.. ఇద్దరు కాదు… ఏకంగా నలుగురు తమ్ముళ్లు కావాలి. దీంతో ఆర్టిస్టులకు తెగ ఇబ్బంది అయిపోతోంది. చెల్లెళ్లు పాత్రలంటే ఎలాగోలా ఏరుకొని వచ్చేయొచ్చు. కానీ తమ్ముళ్లు అనేసరికి ఓ పట్టాన సెట్ అవ్వడం లేదు. పవన్ కాటమరాయుడి పరిస్థితి ఇది. సినిమాలో పవన్ కు నలుగురు తమ్ముళ్లు. వాళ్లలో ఒక్క కమల్ కామరాజు మాత్రమే సెట్ అయ్యాడు. మిగతా వాళ్ల కోసం సెర్చింగ్. నలుగుర్లో కీలకమైన తమ్ముడి పాత్ర కోసం శర్వానంద్ ను అనుకున్నారు. కానీ శర్వ మాత్రం ఆ ఆఫర్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోలో హీరోగా ఉన్న తను, తమ్ముడిగా మారితే బాగుండదని సున్నితంగా తప్పుకున్నాడట. మరోవైపు పెళ్లిచూపులు హీరో దేవరకొండ విజయ్ ను కూడా సంప్రదించారనే వార్తలు వచ్చాయి. కానీ ఆ హీరో మాత్రం తనను ఇంకా ఎవరూ సంప్రదించలేదు అంటున్నాడు. మరోవైపు దర్శకుడు డాలీ కొత్త ముఖాల కోసం కూడా వెదుకుతున్నాడు. కుదిరితే పరిచయం ఉన్న ముఖాలు లేదంటే కొత్త నటులతో తమ్ముడి పాత్రలు ఫిల్ చేయాలని డాలీ భావిస్తున్నాడట. మరో 10 రోజుల్లో పవన్ తమ్ముళ్ల క్యారెక్టర్లు ఫిక్స్ అవ్వాలి. లేదంటే పవన్ కాల్షీట్లు వృధా అయిపోతాయి. ప్రస్తుతం యూనిట్ ఇదే టెన్షన్ లో ఉంది.

Also Read

జనతా గ్యారేజ్ అసలైన లెక్కలివే…జనతా గ్యారేజ్ అసలైన లెక్కలివే…

పవన్ – కొరటాల కాంబినేషన్…పవన్ – కొరటాల కాంబినేషన్…

కాటమరాయుడు లో అన్నయ్యగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు లో అన్నయ్యగా పవన్ కళ్యాణ్

First Published:  26 Sep 2016 9:30 PM GMT
Next Story