Telugu Global
NEWS

ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీల తుపాకులు వెనక్కు

నయీం కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. నయీం అరాచకాల్లో పాలుపంచుకున్న రాజకీయ నాయకులు, పోలీసులపై సిట్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా నయీంతో కలిసిన నడిచిన రాజకీయ నాయకుల, పోలీసుల  తుపాకులు వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. సర్వీస్ రివాల్వర్లు సరెండర్ చేయాల్సిందిగా నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు ఉన్నారు. మొత్తం 21 మంది పోలీసు అధికారులు నయీంతో […]

ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీల తుపాకులు వెనక్కు
X

నయీం కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. నయీం అరాచకాల్లో పాలుపంచుకున్న రాజకీయ నాయకులు, పోలీసులపై సిట్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా నయీంతో కలిసిన నడిచిన రాజకీయ నాయకుల, పోలీసుల తుపాకులు వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. సర్వీస్ రివాల్వర్లు సరెండర్ చేయాల్సిందిగా నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు ఉన్నారు. మొత్తం 21 మంది పోలీసు అధికారులు నయీంతో సంబంధాలు నడిపినట్టు గుర్తించారు. ఇప్పటికే 8 మందికి నోటీసులు జారీ చేసిన సిట్.. త్వరలోనే మిగిలిన 13మంది పోలీసు అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి రివాల్వర్లను సరెండర్ చేయాల్సిందిగా ఆదేశించనున్నారు. పలువురు రాజకీయ నాయకుల నుంచి కూడా లైసెన్స్‌డ్‌ రివాల్వర్లను వెనక్కు తీసుకోవాలని పోలీసు శాఖ నిర్ణయించింది. నోటీసులు అందుకోబోతున్న నేతల్లో అన్ని పార్టీల వారు ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు కొందరు నేతలు ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి. నయీంతో కలిసి తాము చేసిన యధవ పనులు వివరించి వాటి నుంచి బయటపడేందుకు ఏవైనా లూప్‌హోల్స్ ఉన్నాయా అన్న దానిపై సీనియర్‌ న్యాయవాదుల ద్వారా ఆరా తీస్తున్నారు.

Click on Image to Read:

kurugondla-ramakrishna

chandrababu-naidu-ramakrishna

konatala-ramakrishna

First Published:  27 Sep 2016 10:39 AM GMT
Next Story