Telugu Global
National

పిల్ల‌ల‌కు కాళ్లు క‌డిగి పూజ‌లు చేసిన సీఎం

దేశంలో చాలామంది ముఖ్య‌మంత్రులు ఉన్నా.. కొంత‌మందికి ఉండే ఇమేజ్ మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటుంది. అలాంటి కోవ‌కే చెందుతారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌. సీఎం కాక‌ ముందే ప‌రుష‌మైన మాట‌ల‌తో త‌ర‌చూ వివాదాల్లో కూరుకుపోయిన ఆయ‌న.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య‌మంత్రా అన్న ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మైంది. అయితే.. యోగికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వార్త‌లుగా రావ‌టంతో.. ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ గురించి అర్థ‌మై.. ఆయ‌న‌కు ఫ్యాన్స్ అయినోళ్లు ఎంతోమంది. ఎంపీగా ప‌లుమార్లు విజ‌యం […]

దేశంలో చాలామంది ముఖ్య‌మంత్రులు ఉన్నా.. కొంత‌మందికి ఉండే ఇమేజ్ మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటుంది. అలాంటి కోవ‌కే చెందుతారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌. సీఎం కాక‌ ముందే ప‌రుష‌మైన మాట‌ల‌తో త‌ర‌చూ వివాదాల్లో కూరుకుపోయిన ఆయ‌న.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య‌మంత్రా అన్న ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మైంది. అయితే.. యోగికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వార్త‌లుగా రావ‌టంతో.. ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ గురించి అర్థ‌మై.. ఆయ‌న‌కు ఫ్యాన్స్ అయినోళ్లు ఎంతోమంది.

ఎంపీగా ప‌లుమార్లు విజ‌యం సాధించ‌ట‌మే కాదు.. ఫక్తు హిందుత్వ వాదిగా క‌నిపించిన ఆయ‌న‌లో.. అన్ని మ‌తాల వారిని స‌మానంగా చూడ‌టం.. వివ‌క్ష అన్న‌ది లేకుండా ఉండ‌టం లాంటివి యోగిలో ఉంటాయ‌ని తెలిసి ప‌లువురిని ఆక‌ట్టుకునేలా చేసింది. అన్నింటికి మించి ముఖ్య‌మంత్రిగా డాబు.. ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌కుండా.. సాదాసీదాగా ఉంటూ.. నార్మ‌ల్ లైఫ్ ను లీడ్ చేయ‌టం చాలామందిని ఆక‌ట్టుకుంది.

లైఫ్ స్టైల్ తోపాటు.. అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించే తీరు.. పాల‌నా ర‌థాన్ని ప‌రుగులు పెట్టిస్తున్న తీరు ఆక‌ట్టుకునేలా ఉంటున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న ప్ర‌తి ఏటా తాను నిర్వ‌హించే న‌వమి పూజ‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బాలిక‌ల కాళ్లు క‌డిగి నుదుట మీద తిల‌కం దిద్ద‌టం.. క‌న్య‌ల కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి.. వారి ఆశీస్సులు పొంద‌టం.. వారికి హ‌ల్వా తినిపించ‌టం లాంటివి చేశారు. ప్ర‌తిఏటా ఇలాంటివి చేసే యోగి.. సీఎం అయ్యాకా అదే ఆచారాన్ని కొన‌సాగించ‌టం గ‌మ‌నార్హం. ఈ కార్య‌క్ర‌మానికి ముందు.. ప్ర‌జాద‌ర్బారు నిర్వ‌హించి.. మ‌హిళ‌ల నుంచి స‌మ‌స్య‌లు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా.. అక్ర‌మ క‌బేళాలు.. మాంసం దుకాణాల‌పై ఉక్కుపాదం మోపుతున్న సీఎం యోగి ప్ర‌భుత్వాన్ని అల‌హాబాద్ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌జ‌లు న‌చ్చిన ఆహారాన్ని తిన‌టం.. ఆహార‌ప‌దార్థాల వ్యాపారాన్ని చేప‌ట్టి జీవించ‌టం జీవ‌న హ‌క్కులో భాగ‌మ‌ని.. ఆ హ‌క్కులు దెబ్బ తిన‌కుండా ఉండేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించి.. ప‌ది రోజుల్లో త‌మ‌కు అంద‌జేయాల‌ని కోర్టు ఆదేశించింది. యోగి స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అక్ర‌మ క‌బేళాలు.. మాంసం దుకాణాల్ని మూయించేసిన వైనం తెలిసిందే. దీంతో.. ఈ వ్య‌వ‌హారంపై కోర్టును ఆశ్ర‌యించిన నేప‌థ్యంలో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

First Published:  4 April 2017 8:01 PM GMT
Next Story