అమెరికా టాప్-10లో గీతగోవిందం

విడుదలై ఇన్ని రోజులైనా గీతగోవిందం హవా మాత్రం తగ్గలేదు. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా, నెల రోజులు గడిచినా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో వసూళ్లు సాధిస్తూనే ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ టాప్-10 చిత్రాల జాబితాలోకి చేరిన ఈ సినిమా తాజాగా మరో మెట్టు పైకి ఎగబాకింది.

ఇప్పటికే ఖైదీ నంబర్ 150 లైఫ్ టైం వసూళ్లను అధిగమించిన గీతగోవిందం, మొన్నటివరకు 8వ స్థానంలో ఉండేది. తాజాగా ఇది అ..ఆ సినిమా వసూళ్లను కూడా క్రాస్ చేసి 7వ స్థానాన్ని ఆక్రమించింది. మరో 10 రోజులు ఇలానే స్టడీగా కొనసాగితే, మహానటిని కూడా క్రాస్ చేసి 6వ స్థానానికి ఎగబాకడం ఖాయం.

యూఎస్ టాప్-10 సినిమాలు

1. బాహుబలి-2 – 2,01,17,274 డాలర్లు
2. బాహుబలి – 6,999,312 డాలర్లు
3. రంగస్థలం – 3,513,450 డాలర్లు
4. భరత్ అనే నేను – 3,416,451 డాలర్లు
5. శ్రీమంతుడు – 2,890,786 డాలర్లు
6. మహానటి – 2,543,515 డాలర్లు
7. గీతగోవిందం – 2,454,233 డాలర్లు
8. అ..ఆ – 2,449,174 డాలర్లు
9. ఖైదీ నంబర్ 150 – 2,447,043 డాలర్లు
10. ఫిదా – 2,066,937 డాలర్లు