Telugu Global
Cinema & Entertainment

ఐటెం గర్ల్ గా మారిన “ఆర్ ఎక్స్100” బ్యూటీ

“ఆర్ ఎక్స్ 100” సినిమాతో హాట్ భామ పేరు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ ఒక్క హిట్ తో పాయల్ రాజ్ పుత్ ఫేట్ మారిపోయింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడుకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈమె ఇప్పటి వరకు ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం పాయల్ ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేయ్యడానికి ఒప్పుకుంది అని తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తేజ […]

“ఆర్ ఎక్స్ 100” సినిమాతో హాట్ భామ పేరు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ ఒక్క హిట్ తో పాయల్ రాజ్ పుత్ ఫేట్ మారిపోయింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడుకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈమె ఇప్పటి వరకు ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం పాయల్ ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేయ్యడానికి ఒప్పుకుంది అని తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు పాయల్ ని ఒప్పించారట మూవీ యూనిట్.

మరి మంచి క్రేజ్ ఉన్న పాయల్ ని తెచ్చి ఐటెం సాంగ్ చేయిస్తే మూవీ కి ప్లస్ పాయింట్ అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం, మరి హీరోయిన్ అవకాశాలు వస్తే ఒప్పుకోని ఈ భామ… ఇప్పుడు ఐటెం సాంగ్ ఎందుకు ఒప్పుకుంది అనేది డౌట్ గా మారింది. మరి ఇలా ఐటెం సాంగ్స్ చేస్తే ఇక హీరోయిన్ అవకాశాలు ఎలా వస్తాయి అనేది కొందరి వాదన.

First Published:  15 Sep 2018 12:51 AM GMT
Next Story