‘డి’ లోపిస్తే టెన్షనే!

దేహంలో ఒక్కో విటమిన్ ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే విటమిన్ ‘డి’ లోపిస్తే ఎదురయ్యే సమస్యల్లో పిల్లల్లో ఆస్త్మా, గుండెసమస్యలు, రికెట్స్ వంటి ఎముకల సమస్య, మధుమేహంతోపాటు హైబీపీ కూడా ఒకటి. ‘డి’ విటమిన్ లోపిస్తే ఆహారంలో తీసుకున్న క్యాల్షియం దేహానికి పట్టదు. దాంతో క్యాల్షియం లోపం కారణంగా ఎదురయ్యే సమస్యలు కూడా తోడవుతుంటాయి. – చేపలు, ఫిష్‌లివర్ ఆయిల్, కోడిగుడ్డు, పాలు, పాల ఉత్పత్తులు, గింజ ధాన్యాలలో ‘డి’ విటమిన్ ఉంటుంది. ఇటీవల కొన్నేళ్లుగా ‘డి’ విటమిన్ లోపం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఇందుకు ఆహారంలో వీటిని తీసుకోవడంలో అశ్రద్ధకంటే సూర్యరశ్మి సోకని జీవనశైలి ప్రభావమే ఎక్కువ. సాయంత్రపు ఎండ దేహానికి మంచి చేస్తుంది. ఈ సమయంలో తోటపని చేయడం, నడక వంటి వ్యాపకాలు పెట్టుకోవడం మంచిది.

SHARE
Previous articleకచుడు
Next articleదానం