ప్రియురాలి ఆత్మహత్య…. తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు వేర్వేరుగా ఆత్యహత్య చేసుకున్నారు. శంకరపల్లి మండలం టంగుటూరుకు చెందిన 19ఏళ్ల లావణ్య, 21 ఏళ్ల ఎల్లేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఎల్లేష్‌ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. లావణ్య పదో తరగతి వరకు చదివి ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటోంది. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో వీరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో లావణ్య తన ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషయం తెలియగానే ఎల్లేష్‌ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే వీరిద్దరు ప్రేమించుకున్న విషయం తమకు తెలియదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు. వీరిద్దరివి వేర్వేరు కులాలు