“అరవింద సమేత” లో పూజ హెగ్డే పాత్ర ఇదే

ఎన్టీఆర్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా “అరవింద సమేత వీర రాఘవ”. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి పాట ఇటివలే రిలీజ్ అయ్యి మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో పూజ హెగ్డే ఒక డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ గా నటిస్తుందట. తానూ వృత్తి పరంగా ఒక డాక్యుమెంటరీ షూట్ చేయడానికి అనుకోని పరిస్థితుల్లో రాయలసీమ వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఎన్టీఆర్ ని తోడు పెట్టుకొని రాయలసీమ కి వెళ్తుంది పూజ.

ఇక అక్కడికి వెళ్ళిన తరువాత పూజ ఎలాంటి చిక్కుల్లో పడింది ఎన్టీఆర్ పూజ ని ఎలా కాపాడాడు అనేది “అరవింద సమేత” కథట. సినిమాలో హీరోయిన్ కి ముఖ్య పాత్ర ఉంది కాబట్టి టైటిల్ లో కూడా “అరవింద సమేత” అని పూజ పాత్ర పేరు కూడా కలిసి వచ్చేలా పెట్టాడు త్రివిక్రమ్. ఇక పూజ… సునీల్ మధ్యలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయట. మరి అసలే ఫ్లాప్స్ లో ఉన్న త్రివిక్రమ్ ఈ సినిమాతో అయిన ప్రేక్షకుల అంచనాల్ని అందుకుంటాడో లేదో చూద్దాం.