Telugu Global
National

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రేస్ లో కొహ్లీ, చాను

సెప్టెంబర్ 25న క్రీడాపురస్కారాల ప్రదానం ప్రపంచ క్రికెట్ నంబర్ వన్ ఆటగాడు కొహ్లీ మహిళల వెయిట్ లిఫ్టింగ్ విశ్వవిజేత మీరాబాయి చాను భారత అత్యున్నత క్రీడాపురస్కారం …రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు రేసులో …టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ లో ప్రపంచ చాంపియన్ మీరాబాయి చాను పోటీపడుతున్నారు. 2016 సీజన్ లోనే ఖేల్ రత్న పురస్కారం కోసం కొహ్లీ పేరును ప్రతిపాదించినా ఎంపిక కాలేకపోయాడు. అయితే … గత ఏడాది కాలంగా అసాధారణంగా […]

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రేస్ లో కొహ్లీ, చాను
X
  • సెప్టెంబర్ 25న క్రీడాపురస్కారాల ప్రదానం
  • ప్రపంచ క్రికెట్ నంబర్ వన్ ఆటగాడు కొహ్లీ
  • మహిళల వెయిట్ లిఫ్టింగ్ విశ్వవిజేత మీరాబాయి చాను

భారత అత్యున్నత క్రీడాపురస్కారం …రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు రేసులో …టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ లో ప్రపంచ చాంపియన్ మీరాబాయి చాను పోటీపడుతున్నారు.

2016 సీజన్ లోనే ఖేల్ రత్న పురస్కారం కోసం కొహ్లీ పేరును ప్రతిపాదించినా ఎంపిక కాలేకపోయాడు. అయితే … గత ఏడాది కాలంగా అసాధారణంగా రాణించిన కొహ్లీ…ఇటీవలే ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 594 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం ఆటగాడిగా, కెప్టెన్ గా అందుకోగలిగాడు. మరోవైపు ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను బంగారు పతకం సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

అంతటితో ఆగిపోకుండా… గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో సైతం స్వర్ణ పతకం సంపాదించింది. అవార్డు కోసం ఈ ఇద్దరి పేర్లు నామినేట్ చేసినట్లు… క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ ఇద్దరికీ సంయుక్తంగా అవార్డు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఒకవేళ విరాట్ కొహ్లీ రాజీవ్ ఖేల్ రత్న కు ఎంపికైతే…. ఈ గౌరవం పొందిన మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరతాడు.

గతంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే రాజీవ్ ఖేల్ రత్న గౌరవం పొందిన క్రికెటర్లుగా ఉన్నారు.

First Published:  17 Sep 2018 8:15 AM GMT
Next Story