మారుతి అందుకే నయనతారతో గొడవ పెట్టుకున్నాడట

డైరెక్టర్ మారుతి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “బాబు బంగారం”. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ టైంలో నయనతార కి, మారుతీ కి గొడవ జరిగిందట. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార మారుతితో చాలా దురుసుగా ప్రవర్తించిందట. “నేనంటే చిన్న దర్శకుడిని కాబట్టి గౌరవం ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోకు కూడా గౌరవం ఇవ్వలేదని అందుకే షూటింగ్ టైం లో నయనతార తో గొడవ పెట్టుకున్నాను” అని చెప్పేసాడు మారుతి.

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నయనతార ఇక్కడ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ హీరోలను లెక్కచేయకుండా అవమానిస్తోంది అనే టాక్ ఉంది. అంతేకాదు సినిమా చేస్తాను తప్ప…. ప్రమోషన్ కార్యక్రమాలకు రానని నిర్మాతలకి కూడా తేల్చి చెప్పేస్తోంది ఈ మలయాళ బ్యూటీ.

అయినా ఇంతగా అవమానిస్తున్నా కూడా మళ్ళీ ఆ భామనే పెట్టి మరీ సినిమాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తెలుగు లో నయనతార నటించిన లేటెస్ట్ సినిమా అయిన “కోకిలా” పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం తెలుగు లో “సై రా నరసింహారెడ్డి” సినిమా ఒక్కటే నయనతార చేతిలో ఉంది.