Telugu Global
Cinema & Entertainment

స్టూడెంట్ గా నటిస్తున్న శర్వానంద్

“బ్రహ్మోత్సవం” లాంటి భారీ ఫ్లాప్ తరువాత శ్రీకాంత్ అడ్డాలా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా స్టార్ట్ చెయ్యలేదు. కానీ ఫిలిం నగర్ లో మాత్రం శ్రీకాంత్ అడ్డలా తన తదుపరి సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ బయటకి వచ్చింది. అల్లు అరవింద శ్రీకాంత్ అడ్డలా మీద ఉన్న నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. శర్వానంద్ ఈ సినిమాలో ఈ హీరో గా నటిస్తున్నాడు. అయితే శర్వానంద్ […]

స్టూడెంట్ గా నటిస్తున్న శర్వానంద్
X

“బ్రహ్మోత్సవం” లాంటి భారీ ఫ్లాప్ తరువాత శ్రీకాంత్ అడ్డాలా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా స్టార్ట్ చెయ్యలేదు. కానీ ఫిలిం నగర్ లో మాత్రం శ్రీకాంత్ అడ్డలా తన తదుపరి సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ బయటకి వచ్చింది. అల్లు అరవింద శ్రీకాంత్ అడ్డలా మీద ఉన్న నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. శర్వానంద్ ఈ సినిమాలో ఈ హీరో గా నటిస్తున్నాడు. అయితే శర్వానంద్ కోసం కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఒక కథ రాసుకున్నాడు అంట శ్రీకాంత్ అడ్డాలా.

ఈ సినిమాలో పూర్తీ స్థాయి స్టూడెంట్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు. శ్రీకాంత్ అడ్డలా తో సినిమా అనగాగానే చాలా మంది హీరోలు వెనకడుగు వేసారు, కానీ శర్వానంద్ ఒక్కడు మాత్రమే… కథ మీద ఉన్న నమ్మకంతో సినిమా చేయ్యడానికి ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే శర్వానంద్ ప్రస్తుతం “పడి పడి లేచే మనసు” సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే సుదీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమాతో కూడా శర్వా బిజీ బిజీగా గడుపుతున్నాడు.

First Published:  17 Sep 2018 7:57 AM GMT
Next Story