Telugu Global
NEWS

పోటీకి ముందే కాంగ్రెస్ ను దెబ్బతీసేలా టీఆర్ఎస్ వ్యూహం

అధికారం కోసం అంతా ఎగబడుతారు. అధికార పార్టీలో ఉంటేనే నాలుగు పనులు చేసుకోవచ్చు. నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చని భావిస్తారు. అందుకే ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సీటు ఇవ్వడు…. అల్ రెడీ ప్రకటించేశారని తెలిసినా వలస వెళ్లేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పుడీ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ ను షేక్ చేస్తున్నాయి. మొన్నీ మధ్యే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్ల ప్రకటన చేశాక కారెక్కారు. ఆయనకు సీటు రాదని తెలిసినా చేరారు. కానీ డీఎస్ స్థానంలో […]

పోటీకి ముందే కాంగ్రెస్ ను దెబ్బతీసేలా టీఆర్ఎస్ వ్యూహం
X

అధికారం కోసం అంతా ఎగబడుతారు. అధికార పార్టీలో ఉంటేనే నాలుగు పనులు చేసుకోవచ్చు. నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చని భావిస్తారు. అందుకే ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సీటు ఇవ్వడు…. అల్ రెడీ ప్రకటించేశారని తెలిసినా వలస వెళ్లేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పుడీ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ ను షేక్ చేస్తున్నాయి.

మొన్నీ మధ్యే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్ల ప్రకటన చేశాక కారెక్కారు. ఆయనకు సీటు రాదని తెలిసినా చేరారు. కానీ డీఎస్ స్థానంలో రాజ్యసభ సీటు ఇస్తామని అందుకే చేర్చుకున్నారనే ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా కరీంనగర్, వరంగల్ జిల్లాలలోని కాంగ్రెస్ టికెట్ ఆశించిన నేతలు టీఆర్ఎస్ లో చేరిపోతుండడంతో కాంగ్రెస్ లో ఆందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కారెక్కేందుకు రెడీ అయ్యారు. గడిచిన ఎన్నికల్లో ఆయన కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈసారి సీటు ఖాయమైనా కూడా ఆయన కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు.

ఇదే కాదు.. వేములవాడ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఏనుగు మనోహర్ రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బొమ్మ వెంకటేశ్వర్, ఆయన తనయుడు, వరంగల్ జిల్లా నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వారందరినీ కేటీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు తాజా సమాచారం. వీరిందరికీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవులు ఇస్తానని ఎరచూపుతున్నారు.

కేవలం ఉత్తర తెలంగాణలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపుపై ఆశలు లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు గాలం వేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఇప్పటికే కొందరు చేరుతుండగా.. మరికొందరు కారెక్కబోతున్నారట. ఇలా పోటీకి ముందే కాంగ్రెస్ ను దెబ్బతీసి గెలిచే వ్యూహానికి తాజాగా కేసీఆర్ తెరదీయడం కాంగ్రెస్ ను షాక్ కు గురిచేస్తోంది.

First Published:  17 Sep 2018 8:25 AM GMT
Next Story