Telugu Global
National

త‌మిళ‌నాడులో ఆటోడ్రైవ‌ర్‌ పై దాడి.... బిజెపి నేత‌ల అరాచ‌కం

త‌మిళ‌నాడులో బిజెపి కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. ఓ ఆటో డ్రైవ‌ర్‌ను చిత‌క్కొట్టారు. డీజిల్, పెట్రోల్ ధ‌ర‌లు ఎందుకు విప‌రీతంగా పెంచుతున్నారంటూ ఆటో డ్రైవ‌ర్ త‌మిళ‌నాడు బిజెపి చీఫ్ త‌మిల‌సాయి సౌంద‌ర‌రాజ‌న్‌ను నిల‌దీశాడు. దీంతో బిజెపి కార్య‌క‌ర్త‌లు వీరంగం సృష్టించారు. ఆదివారం రాత్రి సాయిదాపేట‌లో మీడియాతో మాట్లాడుతున్న‌సౌంద‌ర‌రాజ‌న్ ను అక్క‌డే ఉన్న ఖాతిర్ అనే ఆటోడ్రైవ‌ర్ ఇంధ‌న ధ‌ర‌లు త‌ర‌చుగా ఎందుకు పెరుగుతున్నాయి అని మ‌ర్యాద పూర్వ‌కంగా అడిగాడు. సిస్ట‌ర్ అని కూడా సంభోదించాడు. ఖాతిర్ వేసిన‌ ప్ర‌శ్న‌కు జ‌వాబు […]

త‌మిళ‌నాడులో ఆటోడ్రైవ‌ర్‌ పై దాడి.... బిజెపి నేత‌ల అరాచ‌కం
X

త‌మిళ‌నాడులో బిజెపి కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. ఓ ఆటో డ్రైవ‌ర్‌ను చిత‌క్కొట్టారు. డీజిల్, పెట్రోల్ ధ‌ర‌లు ఎందుకు విప‌రీతంగా పెంచుతున్నారంటూ ఆటో డ్రైవ‌ర్ త‌మిళ‌నాడు బిజెపి చీఫ్ త‌మిల‌సాయి సౌంద‌ర‌రాజ‌న్‌ను నిల‌దీశాడు. దీంతో బిజెపి కార్య‌క‌ర్త‌లు వీరంగం సృష్టించారు.

ఆదివారం రాత్రి సాయిదాపేట‌లో మీడియాతో మాట్లాడుతున్న‌సౌంద‌ర‌రాజ‌న్ ను అక్క‌డే ఉన్న ఖాతిర్ అనే ఆటోడ్రైవ‌ర్ ఇంధ‌న ధ‌ర‌లు త‌ర‌చుగా ఎందుకు పెరుగుతున్నాయి అని మ‌ర్యాద పూర్వ‌కంగా అడిగాడు. సిస్ట‌ర్ అని కూడా సంభోదించాడు. ఖాతిర్ వేసిన‌ ప్ర‌శ్న‌కు జ‌వాబు చెప్ప‌కుండా ఆమె మీడియాతో త‌న చిట్‌చాట్ కొన‌సాగించింది. దీంతో ఖాతిర్ మ‌రోసారి ఆమెను ప్ర‌శ్నించాడు. దీంతో అక్క‌డే ఉన్న బిజెపి కార్య‌క‌ర్త‌లు కొంద‌రు అత‌డి ప‌క్క‌కు తీసుకువెళ్లారు. చేయి చేసుకున్నారు.

త‌న‌పై జ‌రిగిన దాడిని ఖాతిర్ మీడియాకు వివ‌రించాడు. కేవలం ప్ర‌శ్నించినందుకే త‌న‌పై చేయి చేసుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశ్యంతో తాను ప్ర‌శ్న వేయ‌లేద‌ని ఖాతిర్ స్ప‌ష్టం చేశాడు. మ‌రోవైపు సౌంద‌ర‌రాజ‌న్ ఈ వివాదాన్ని క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రిపైనా దాడి జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. ఒక‌వేళ ఎవ‌రిపైన అయినా దాడి జ‌రిగిన‌ట్ల‌యితే దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని చెప్పి చేతులు దులుపుకున్నారు.

First Published:  17 Sep 2018 11:42 PM GMT
Next Story