Telugu Global
Cinema & Entertainment

బడా హీరో సినిమా విడుదలపై సందిగ్దం

విక్రమ్.. సౌత్ లో ఈ హీరో పేరు తెలియని వారుండరు. ఎన్నో హిట్ సినిమాలతో, మరెన్నో ప్రయోగాలు, అవార్డులతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. అయితే ఇదంతా గతం. ఇప్పుడు విక్రమ్ క్రేజ్ పూర్తిగా పడిపోయింది. వరుసగా ఫ్లాపులొస్తున్నాయి. మార్కెట్ కూడా డల్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో విక్రమ్ నటించిన ఓ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. హరి దర్శకత్వంలో సామి అనే సినిమా చేశాడు విక్రమ్. లెక్కప్రకారం ఈ […]

బడా హీరో సినిమా విడుదలపై సందిగ్దం
X

విక్రమ్.. సౌత్ లో ఈ హీరో పేరు తెలియని వారుండరు. ఎన్నో హిట్ సినిమాలతో, మరెన్నో ప్రయోగాలు, అవార్డులతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. అయితే ఇదంతా గతం. ఇప్పుడు విక్రమ్ క్రేజ్ పూర్తిగా పడిపోయింది. వరుసగా ఫ్లాపులొస్తున్నాయి. మార్కెట్ కూడా డల్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో విక్రమ్ నటించిన ఓ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

హరి దర్శకత్వంలో సామి అనే సినిమా చేశాడు విక్రమ్. లెక్కప్రకారం ఈ సినిమా గతవారమే రిలీజ్ అవ్వాలి. కానీ టాలీవుడ్ లో విక్రమ్ మార్కెట్ పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో.. తెలుగులో ఈ సినిమాకు బిజినెస్ పూర్తికాలేదు. సో.. వారం రోజులు వాయిదా వేసి ఈ వీకెండ్ కు సినిమా విడుదల ప్లాన్ చేశారు. అయితే ఈసారి కూడా రిలీజ్ పై అనుమానాలు తొలిగిపోలేదు. చాలా ప్రాంతాల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ డల్ గా ఉంది.

సామి సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో మహానటి సినిమాతో ఆమె బాగా పాపులర్ అయింది. ఆమె ఉండడంతో సినిమాకు కాస్తయినా బిజినెస్ జరిగింది. లేదంటే సామి సినిమా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. ఈ శుక్రవారమైనా ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనేది మరో 2 రోజుల్లో తేలుతుంది.

First Published:  18 Sep 2018 7:44 AM GMT
Next Story