Telugu Global
Cinema & Entertainment

మారుతీ దర్శకత్వంలో నాగార్జున

తెలుగు ఇండస్ట్రీ కి “ఈరోజుల్లో” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మారుతి… తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ఇటివలే నాగ చైతన్యతో “శైలజా రెడ్డి అల్లుడు” తెరకెక్కించి చైతు కి మాస్ లో కొంత వరకు ఫాలోయింగ్ తీసుకురాగలిగాడు. ఇక మళ్ళీ అక్కినేని కాంపౌండ్ లో అతను మరో సినిమా చేసే అవకాశం వచ్చిందట. “శైలజ రెడ్డి అల్లుడు” సినిమాతో చైతు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందించిన మారుతీకి నాగార్జున ఛాన్స్ […]

మారుతీ దర్శకత్వంలో నాగార్జున
X

తెలుగు ఇండస్ట్రీ కి “ఈరోజుల్లో” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మారుతి… తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ఇటివలే నాగ చైతన్యతో “శైలజా రెడ్డి అల్లుడు” తెరకెక్కించి చైతు కి మాస్ లో కొంత వరకు ఫాలోయింగ్ తీసుకురాగలిగాడు. ఇక మళ్ళీ అక్కినేని కాంపౌండ్ లో అతను మరో సినిమా చేసే అవకాశం వచ్చిందట. “శైలజ రెడ్డి అల్లుడు” సినిమాతో చైతు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందించిన మారుతీకి నాగార్జున ఛాన్స్ ఇచ్చాడట.

ఆల్రెడీ మారుతి డైరక్షన్ లో వెంకటేష్ “బాబు బంగారం” చేశాడు. “శైలజా రెడ్డి అల్లుడు” రిజల్ట్ ను బట్టి మారుతి సినిమా ని ఓకే చేసాడట నాగార్జున. అక్కినేని నాగార్జున కోసం మారుతీ ఇప్పటికే ఒక కామెడీ కథని రెడీ చేసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లొనే ఉండవచ్చు. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం “దేవదాస్” రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. నాని కూడా హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.

First Published:  18 Sep 2018 6:45 AM GMT
Next Story