Telugu Global
CRIME

రేప్ బాధితులకు శాపంగా మారిన సోషల్ మీడియా

సభ్యసమాజం తలదించుకునే వ్యవహారమిది. కొన్ని యూట్యూబ్ చానెళ్లు , సోషల్ మీడియా చేస్తున్న అకృత్యాలకు నిదర్శనమీ చిత్రం.. తమ వ్యూస్ కోసం.. రేటింగ్స్ కోసం పాపం అమాయకపు రేప్ బాధితులను బలిచేస్తున్న వైనమిది. అభం శుభం తెలియని పసివాళ్ల జీవితాలను చిదిమేస్తున్న నయా వికృత క్రీడ ఇదీ..తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై రేప్ ఉందంతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కుటుంబ కుమిలి కుమిలి ఏడుస్తోందట. ఆ చిన్నారికి భవిష్యత్ లేకుండా […]

రేప్ బాధితులకు శాపంగా మారిన సోషల్ మీడియా
X

సభ్యసమాజం తలదించుకునే వ్యవహారమిది. కొన్ని యూట్యూబ్ చానెళ్లు , సోషల్ మీడియా చేస్తున్న అకృత్యాలకు నిదర్శనమీ చిత్రం.. తమ వ్యూస్ కోసం.. రేటింగ్స్ కోసం పాపం అమాయకపు రేప్ బాధితులను బలిచేస్తున్న వైనమిది. అభం శుభం తెలియని పసివాళ్ల జీవితాలను చిదిమేస్తున్న నయా వికృత క్రీడ ఇదీ..తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై రేప్ ఉందంతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కుటుంబ కుమిలి కుమిలి ఏడుస్తోందట. ఆ చిన్నారికి భవిష్యత్ లేకుండా చేసిన వైనంపై అందరూ సోషల్ మీడియా, వెబ్ చానెళ్లపై హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇటీవల టోలిచౌకీలోని అజాన్ ఇంటర్ నేషనల్ స్కూల్లో ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఓ బాలుడు దారుణంగా అత్యాచారం చేశారు. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, పలు ఆధారాలు సేకరించి, నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. అయితే ఘటన జరిగిన రోజున చిన్నారికి న్యాయం చేయాలని స్థానికులు, బాధితులు పాఠశాల ఎదుట, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఆందోళన చేయడమే వారి పాలిట శాపమైంది.

కొందరు బాలికను, బాలిక తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రోశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కొన్ని యూట్యూబ్ చానెళ్లు దారుణం, ఘోరం అంటూ రేప్ కు గురైన చిన్నారిని లైవ్ లో చూపించి వారి కుటుంబ పరువు తీశారు. సదురు చానెళ్లకు లక్షలు వ్యూస్ వచ్చినా కానీ చిన్నారి, కుటుంబం మాత్రం అందరికీ బహిర్గతమై వారు మానసిక వేదనకు గురయ్యారు.

నిజానికి అత్యాచారానికి గురైన బాలిక వ్యక్తిగత వివరాలు, వారిని గుర్తించే సంకేతాల వివరాలు మీడియాలో బయటకు చెప్పొద్దని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇలా చేస్తే నేరంగానూ పరిగణిస్తారు. దీంతో పలు ప్రధాన మీడియా సంస్థలు ఈ మార్గదర్శకాలను పాటించి బాలిక వివరాలు బయటపెట్టలేదు.

కానీ ఈ వెబ్ మీడియా, సోషల్ మీడియాలో మాత్రం ఈ సంఘటనను వైరల్ చేశారు. దీనికి ఎలాంటి నిబంధనలు, అడ్డుగోడలు, ఆపేవారు లేకపోవడంతో రేప్ బాధితుల పరువు గంగలో కలిసిపోయింది. తాజాగా బాధితుల వివరాలు బహిర్గతం చేసిన వీడియోలను నిషేధించాలని, వాటిని యూట్యూబ్‌లో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం సభ్యులు సీపీ అంజనీకుమార్ ను కలిసి కోరారు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం ఇప్పటికే జరిగిపోయింది.

First Published:  18 Sep 2018 1:20 AM GMT
Next Story