Telugu Global
Cinema & Entertainment

జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్

ఈ మాట ఇప్పటిది కాదు. దాదాపు దశాబ్దానికి పైగా చర్చల్లో నలుగుతున్న ప్రాజెక్టు. ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టినా ఈ సినిమా ప్రస్తావన తీసుకురాకుండా కార్యక్రమం ముగించరు నిర్మాత అశ్వనీదత్. ఈసారి కూడా ఆయన అదే పని చేశారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ గురించి మరోసారి మాట్లాడారు. ఎప్పటికైనా ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నారు అశ్వనీదత్. కాకపోతే ఈసారి ఆయన దీనికి ఓ కొత్త యాంగిల్ జోడించారు. ఒకప్పటిలా తను రచయితలు, దర్శకుల వెంట పడాల్సిన అవసరం లేదని, […]

జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్
X

ఈ మాట ఇప్పటిది కాదు. దాదాపు దశాబ్దానికి పైగా చర్చల్లో నలుగుతున్న ప్రాజెక్టు. ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టినా ఈ సినిమా ప్రస్తావన తీసుకురాకుండా కార్యక్రమం ముగించరు నిర్మాత అశ్వనీదత్. ఈసారి కూడా ఆయన అదే పని చేశారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ గురించి మరోసారి మాట్లాడారు.

ఎప్పటికైనా ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నారు అశ్వనీదత్. కాకపోతే ఈసారి ఆయన దీనికి ఓ కొత్త యాంగిల్ జోడించారు. ఒకప్పటిలా తను రచయితలు, దర్శకుల వెంట పడాల్సిన అవసరం లేదని, ఈ సీక్వెల్ కోసం తన ఇంట్లోనే దర్శకుడు నాగి (నాగ్ అశ్విన్) ఉన్నాడని చెప్పుకొచ్చారు.

మహానటి లాంటి బయోపిక్ ను అద్భుతంగా హ్యాండిల్ చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. ఇలాంటి దర్శకుడు రంగంలోకి దిగితే, కచ్చితంగా ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కు ఓ రూపు-రంగు రావడం ఖాయం. కాకపోతే నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఆ సీక్వెల్ లో నటించడానికి రామ్ చరణ్ అంగీకరించాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో..?

First Published:  18 Sep 2018 6:59 AM GMT
Next Story