Telugu Global
Cinema & Entertainment

అడివి శేష్ కి సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్

నటుడు, రచయిత అయిన అడివి శేష్. ఇటివలే “గూఢచారి” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మంచి జోష్ మీద ఉన్నాడు. విమర్శకులు సైతం ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసారు. ప్రస్తుతం అడివి శేష్ “2 స్టేట్స్” సినిమాని తెలుగు రీమేక్ లో బిజీగా ఉన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం అడివి శేష్ తదుపరి ప్రాజెక్ట్ ని ముందుకు తిసుకేల్లడానికి స్వయానా సూపర్ స్టార్ ఫ్యామిలీ ఏ దిగి వస్తుందట. మహేష్ బాబు ఫ్యామిలీ […]

అడివి శేష్ కి సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్
X

నటుడు, రచయిత అయిన అడివి శేష్. ఇటివలే “గూఢచారి” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మంచి జోష్ మీద ఉన్నాడు. విమర్శకులు సైతం ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసారు. ప్రస్తుతం అడివి శేష్ “2 స్టేట్స్” సినిమాని తెలుగు రీమేక్ లో బిజీగా ఉన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం అడివి శేష్ తదుపరి ప్రాజెక్ట్ ని ముందుకు తిసుకేల్లడానికి స్వయానా సూపర్ స్టార్ ఫ్యామిలీ ఏ దిగి వస్తుందట.

మహేష్ బాబు ఫ్యామిలీ లో ఒక వ్యక్తి ప్రాజెక్ట్ ని ఓకే చేసే పనిలో ఉన్నాడు అని తెలుస్తుంది. డిజిటల్ మీడియా లో ఇప్పటికే స్టార్ గా కొనసాగుతున్న చాయ్ బిస్కెట్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారట. మరి ఇప్పటికే మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ వెబ్ సిరీస్ వైపు కన్నేసి ఆ వైపుగా అడుగులు వేస్తుంది. మరి ఇలాంటి టైం లో సూపర్ స్టార్ ఫ్యామిలీ లో ఏ వ్యక్తీ అడివి శేష్ కి సపోర్ట్ గా నిలుస్తున్నాడు అనేది ఎవ్వరికి తెలియదు. ఈ విషయం పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

First Published:  17 Sep 2018 11:30 PM GMT
Next Story