Telugu Global
NEWS

తేల్చేసిన వైసీపీ.... ఇక డిసైడ్ చేసుకోవాల్సింది రాధానే !

తాము విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వంగవీటి రాధాకు కేటాయిస్తామని మరోసారి ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. విశాఖలో జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశంలోనే ఈ విషయాన్ని చెప్పామని వైసీపీ ప్రకటించింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం మచిలీపట్నం ఎంపీ సీటు లేదా, విజయవాడ తూర్పు సీటును రాధాకు కేటాయించే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన తనకు ఎంపీ సీటు ఇస్తే తనేం చేయగలను అని రాధా అసహనం వ్యక్తం చేశాడన్న వార్తల నేపథ్యంలో… విజయవాడ […]

తేల్చేసిన వైసీపీ.... ఇక డిసైడ్ చేసుకోవాల్సింది రాధానే !
X

తాము విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వంగవీటి రాధాకు కేటాయిస్తామని మరోసారి ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. విశాఖలో జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశంలోనే ఈ విషయాన్ని చెప్పామని వైసీపీ ప్రకటించింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం మచిలీపట్నం ఎంపీ సీటు లేదా, విజయవాడ తూర్పు సీటును రాధాకు కేటాయించే అవకాశం ఉందని చెప్పారు.

అయితే ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన తనకు ఎంపీ సీటు ఇస్తే తనేం చేయగలను అని రాధా అసహనం వ్యక్తం చేశాడన్న వార్తల నేపథ్యంలో… విజయవాడ తూర్పు సీటును వైసీపీ రాధాకు ఖాయం చేసింది.

మంగళవారం రోజున వైసీపీ నేతలు మాట్లాడుతూ…. విజయవాడ తూర్పు సీటు రాధాకే కేటాయించినట్లు స్పష్టంగా చెప్పారు. రాధాకు తాము ఇదే విషయాన్ని చెప్పామని చెప్పారు. తూర్పులో కాపుల జనాభా గణనీయంగా ఉందని, అక్కడ నుంచి పోటీ చేయడం రాధాకు కూడా మంచిదని వైసీపీ నేతలు అంటున్నారు.

అయితే గత ఎన్నికల్లో తూర్పు నుంచే పోటీ చేసి ఓడిపోయాడు రాధా. గతంలో ఇక్కడ నుంచి గెలిచాడు కానీ…. గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో రాధా తూర్పులో పోటీ చేయడానికి ముందుకు వస్తాడా?లేదా? అనేది సందేహమే అని చెప్పాలి.

ఇప్పటికే రాధా అనుచరులు గుర్రుగా ఉన్నారు. వైసీపికి రాజీనామాలు అంటున్నారు. ఈ రోజు అనుచరులతో సమావేశం అయిన రాధ తనకు మూడు రోజుల సమయం కావాలని అడిగాడట. మూడు రోజుల్లో ఏదో ఒక నిర్ణయాన్ని చెబుతాను అని రాధ ప్రకటించినట్టుగా సమాచారం.

దీనిపై వైసీపీ కూడా రియాక్ట్ అయింది. తూర్పు నియోజకవర్గాన్ని కేటాయిస్తాం.. అని మరోసారి స్పష్టత ఇచ్చింది. మీడియా ముఖంగానే ఈ విషయాన్ని చెప్పింది. ఇక డిసైడ్ చేసుకోవాల్సింది వంగవీటి రాధానే అని స్పష్టం అవుతోంది. మరి ఆయన వైసీపీలోనే ఉంటాడా? లేక జనసేన వైపు వెళ్తాడా? చూడాలి.

First Published:  18 Sep 2018 11:01 AM GMT
Next Story