Telugu Global
CRIME

నగ్న ఫొటోలతో యువకుడికి షాకిచ్చిన యువతి

ఆ విషయంలో అబ్బాయిలే అనుకున్నాం కానీ అమ్మాయిలు కూడా ఇంత దారుణంగా మారిపోతారని అస్సలు ఊహించలేం. ఇన్నాళ్లు అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలను చూశాం కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయ్యింది. అమ్మాయి చేతిలో తన నగ్నత్వాన్ని నడిబజారులో పెట్టుకున్న యువకుడి కథ సంచలనం రేపుతోంది. అది గుంటూరు జిల్లా నరసరావుపేట. 23 ఏళ్ల యువకుడు (పేరు కూడా రాయలేని దుస్థితి తెచ్చుకున్నాడు) బ్యాటరీల పని చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి ఫేస్ బుక్ ద్వారా ఓ యువతి […]

నగ్న ఫొటోలతో యువకుడికి షాకిచ్చిన యువతి
X

ఆ విషయంలో అబ్బాయిలే అనుకున్నాం కానీ అమ్మాయిలు కూడా ఇంత దారుణంగా మారిపోతారని అస్సలు ఊహించలేం. ఇన్నాళ్లు అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలను చూశాం కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయ్యింది. అమ్మాయి చేతిలో తన నగ్నత్వాన్ని నడిబజారులో పెట్టుకున్న యువకుడి కథ సంచలనం రేపుతోంది.

అది గుంటూరు జిల్లా నరసరావుపేట. 23 ఏళ్ల యువకుడు (పేరు కూడా రాయలేని దుస్థితి తెచ్చుకున్నాడు) బ్యాటరీల పని చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి ఫేస్ బుక్ ద్వారా ఓ యువతి పరిచయం అయ్యింది. తరచుగా చాట్ చేయడంతో మనోడు మాటలు కలిపాడు. మనసులు కలిపాడు. తాను గుంటూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని..తనకు పెళ్లై పాప ఉందని. భర్త హైదరాబాద్ లో పనిచేస్తాడని చెప్పుకొచ్చింది. ఒంటరి మహిళ అని క్యాష్ చేసుకుందామని మనోడు సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు.

కొద్దిరోజుల తర్వాత యువతి తన నగ్న చిత్రాన్ని యువకుడికి ఫేస్ బుక్ లో పంపించింది. ఫిదా అయిన మనోడు ఆమె కోరిక మేరకు తన నగ్నచిత్రాన్ని కూడా ఫొటో తీసుకొని పంపాడు. అంతే అప్పుడు అసలు కథ మొదలు అయ్యింది..

ఆ యువతి తనకు డబ్బు అవసరం ఉందని.. ఇవ్వకపోతే నీ నగ్న ఫొటోను సోషల్ మీడియా అన్నింట్లో పెడతానని బెదిరించడం ప్రారంభించింది. యువకుడు ఈ మేరకు విజయవాడలోని అక్క బావ ఇంటికి రాగా అక్కడ యువతి ఫోన్ చేసి బెదిరించడం వారు చూశారు. నిలదీసి అడగ్గా యువతి ఆగడాలను చెప్పేశాడు. దీంతో వారంతా కలిసి మంగళవారం పటమట పోలీసులను ఆశ్రయించారు. యువతిపై పోలీస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలున్నారు కానీ.. అబ్బాయి మోసపోవడం… బోరుమనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

First Published:  19 Sep 2018 12:55 AM GMT
Next Story