Telugu Global
Cinema & Entertainment

సప్తగిరి క్లారిటీ ఇచ్చేసాడు...

కమెడియన్ గా బాగా క్లిక్ అయ్యాడు. ఇక పెద్ద సినిమాల్లో టాప్ కమెడియన్ గా ఎదుగుతాడనుకునే టైమ్ కు ఏకంగా హీరో అవతారం ఎత్తాడు సప్తగిరి. ఇప్పటికే తన పేరుమీద సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్ బి లాంటి సినిమాలు చేశాడు. ప్రస్తుతం మూడో సినిమా సెట్స్ పై ఉంది. ఇక సప్తగిరి హీరోగా సెటిల్ అవుతున్నాడని అంతా అనుకునేలోపే మరో వార్త బయటకొచ్చింది. త్వరలోనే ఈ కమెడియన్ కమ్ హీరో మెగాఫోన్ పట్టుకోబోతున్నాడనేది […]

సప్తగిరి క్లారిటీ ఇచ్చేసాడు...
X

కమెడియన్ గా బాగా క్లిక్ అయ్యాడు. ఇక పెద్ద సినిమాల్లో టాప్ కమెడియన్ గా ఎదుగుతాడనుకునే టైమ్ కు ఏకంగా హీరో అవతారం ఎత్తాడు సప్తగిరి. ఇప్పటికే తన పేరుమీద సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్ బి లాంటి సినిమాలు చేశాడు. ప్రస్తుతం మూడో సినిమా సెట్స్ పై ఉంది. ఇక సప్తగిరి హీరోగా సెటిల్ అవుతున్నాడని అంతా అనుకునేలోపే మరో వార్త బయటకొచ్చింది. త్వరలోనే ఈ కమెడియన్ కమ్ హీరో మెగాఫోన్ పట్టుకోబోతున్నాడనేది ఆ వార్త.

అవును.. తన స్వీయదర్శకత్వంలో సప్తగిరి ఓ సినిమా చేయబోతున్నాడట. దాదాపు 48 గంటలుగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కమెడియన్ గా రంగప్రవేశం చేసి, హీరోగా ఎదిగి, ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నాడంటూ కథనాలు కూడా వచ్చేశాయి.

ఎట్టకేలకు దీనిపై సప్తగిరి క్లారిటీ ఇచ్చాడు. తను దర్శకుడిగా మారడం లేదని ప్రకటించాడు ఈ నటుడు. అంతేకాదు.. తన భవిష్యత్ కార్యాచరణపై కూడా ఓ చిన్నపాటి వివరణ ఇచ్చాడు. తను కేవలం హీరోగా మాత్రమే కొనసాగనని, మంచి పాత్రలు, బ్యానర్లు దొరికితే కమెడియన్ గా కూడా నటిస్తానని తెలిపాడు. రీసెంట్ గా వచ్చిన నీవెవరు సినిమాలో కూడా ఓ మంచి పాత్ర చేశానని తెలిపిన సప్తగిరి, ఇకపై కూడా కామిక్ రోల్స్ లో కనిపిస్తానని అంటున్నాడు. మొత్తమ్మీద ఈ నటుడు దర్శకత్వం చేయడమే విషయంపై ఓ స్పష్టత వచ్చేసింది.

First Published:  19 Sep 2018 8:45 AM GMT
Next Story