Telugu Global
Others

దళితులను ఎస్.సి.లుగా కుందించడం ఎందుకు?

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల మీడియాకు “దళితులు” అన్న మాటకు బదులు “షెడ్యూల్డ్ తరగతులు – ఎస్.సి.లు” అని వాడాలని సూచనలతో హుకుం జారీ చేసింది. అంటే పదప్రయోగంలో నైతికమైన ఓ అధికార క్రమాన్ని ఏర్పాటు చేస్తోందన్న మాట. నాగపూర్ లోని కొంత మంది బౌద్ధులు ఓ అర్జీ దాఖలు చేస్తే “దళితులు” అన్న మాట నైతికంగా ఆగ్రహం కలిగిస్తుంది కనక షెడ్యూల్డ్ కులాలు అని వాడాలని, ఈ మాట రాజ్యాంగంలో ఉంది కనక […]

దళితులను ఎస్.సి.లుగా కుందించడం ఎందుకు?
X

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల మీడియాకు “దళితులు” అన్న మాటకు బదులు “షెడ్యూల్డ్ తరగతులు – ఎస్.సి.లు” అని వాడాలని సూచనలతో హుకుం జారీ చేసింది. అంటే పదప్రయోగంలో నైతికమైన ఓ అధికార క్రమాన్ని ఏర్పాటు చేస్తోందన్న మాట. నాగపూర్ లోని కొంత మంది బౌద్ధులు ఓ అర్జీ దాఖలు చేస్తే “దళితులు” అన్న మాట నైతికంగా ఆగ్రహం కలిగిస్తుంది కనక షెడ్యూల్డ్ కులాలు అని వాడాలని, ఈ మాట రాజ్యాంగంలో ఉంది కనక అదే వాడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

ఎస్.సి.ల నుంచి పోటీ ఎదుర్కుంటున్నామన్న భయంతో అగ్ర వర్ణాల వారు ఈ మాటను దుర్వినియోగం చేస్తున్నందున ఈ మాట వాడడాన్ని రాజ్యాంగం ఏ రకంగానూ నియంత్రించలేదు. కుల ఘర్షణలు తలెత్తినప్పుడు ఎస్.సి.లు అన్న మాటను అగ్రవర్ణాలవారు నిందార్థంలో వాడుతున్నారు. దిల్లీ విశ్వవిద్యాలయంలోని వైద్య కళాశాలలో ఇదే జరిగింది. ఎస్.సి.లు కళాశాలల్లో చదువుకునే స్థాయికి ఎదగడాన్ని సహించనందువల్ల రాజ్యాంగంలో వాడిన ఈ మాటను అగ్రవర్ణాలవారు విరూపం చేస్తున్నందువల్ల ఇది అవమానకరమైందిగా దళితులు భావిస్తున్నారు. తద్వారా ఎదిగే దళితులను, ఎదగడానికి అవకాశం ఉన్న దళితులను అవమానిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలలో కుల ధృవీకరణ పత్రాలు అడుగుతారు. ఎస్.సి.లు అన్న మాట దురుసుగా కనిపించినా ఈ వర్గం వారు ప్రయోజనం పొందడానికి ఆ మాటను వినియోగిస్తుంటారు. కాని ఈ మాట అణగారిన వర్గాల వారు సామాజికంగా సంఘటితం కావడానికి అవరోధాలు సృష్టిస్తోంది. దీనికి తోడు అసలైన ఎస్.సి.లు ఎవరు అన్న తగవు ఆ వర్గాలలోనే తలెత్తుతోంది.

దళితులు అన్న మాట కూడా ఎస్.సి.ల నుంచే పుట్టింది. అంత మాత్రం చేత దళితులు అన్న మాటను ఎస్.సి.లు అని కుదించనక్కర లేదు. షెడ్యూల్డ్ కులాల వారిని శాంతపరచడానికి దళితులు అంటున్నారు. దళితుల మీద జరిగే అఘాయిత్యాలను చాలా మంది ఎస్.సి. రాజకీయ నాయకులు పట్టించుకోనందువల్ల, ఈ విషయమై నిర్దిష్టమైన వైఖరి అనుసరించనందువల్ల 1970ల ఆరంభంలో దళిత పాంథర్ల ఉద్యమం తలెత్తింది. దళితులు అన్న మాటకు బలమైన రాజకీయ అర్థం ఉంది కనక ఆ మాటను ఎస్.సి. అన్న మాటతో దిగజార్చవలసిన అగత్యం లేదు. దళితులు అన్న మాట అణచి వేసే వర్గాలకు, ఎస్.సి.లకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనుకునే వారు ఆ వర్గాలపట్ల ఉదాసీనత ప్రదర్శించడానికి వ్యతిరేకంగా అస్తిత్వంలోకి వచ్చింది.

దళితులు అన్న పదం దోపిడీని, వివక్షను, పితృస్వామ్య దృష్టితో చూపే ఆధిక్యతను ప్రశ్నించే తత్వానికి ప్రతీక. అది అణచివేతకు గురయ్యే వర్గాల సంఘీభావానికి ప్రతీక. నైతికంగా మరింత మౌలికమైన అర్థంలో వాడుతున్న మాట. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డు తరగతుల వారు తమ కులాన్ని నిరూపించుకోనవసరం లేని పదం. దళితులు అన్న పదం అణచివేతకు గురవుతున్న వారికి, అణగారిన వర్గాలకు సంకేతం. అయితే దళితులు అన్న మాటను మహారాష్ట్రకు చెందిన బౌద్ధ రచయితలు, దక్షిణాదికి చెందిన ప్రసిద్ధ సంగీతవేత్తలు, ప్రస్తుతం బౌద్ధులం అని చెప్పుకుంటున్న మహారాష్ట్రలోని వారు వ్యతిరేకిస్తున్నారు. వీరి దృష్టిలో దళితులు అన్న మాట నిందాకరమైంది. నైతికంగా దురాగతమైంది. ఈ మాట తాము అనుభవించిన అవమానానికి చిహ్నం అనుకుంటున్నారు.

బౌద్ధుల విజ్ఞప్తికి లొంగిపోయి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఎస్.సి.లు అని వాడాలని సూచిస్తోంది.
వివిధ రకాల అంటరాని కులాల వారిని కలిపి రాజ్యాంగంలో షెడ్యూల్డ్ తరగతుల వారు అని వాడినందుకు కించిత్ సంతోష పడేవారు ఉండవచ్చు. ఆ వర్గాలకు కల్పించే సంక్షేమ పథకాలు ఆ వర్గాల వారందరికీ అందాలన్న దృష్టితో రాజ్యాంగంలో ఆ మాట వాడి ఉండవచ్చు. కాని అణగారిన వర్గాలకు, వారి సంస్కృతికి సంకేతమైన దళితులను ఎస్.సి.లు అని ప్రస్తావించాలని ప్రభుత్వం సూచించడం అనవసరం. రాజ్య వ్యవస్థ దృష్టిలో అణగారిన వర్గాల వారందరినీ కలిపి ఎస్.సి.లు అనాలనడానికి భిన్నమైన ప్రయోజనాలు ఉండవచ్చు. ఆ ప్రయోజనం రాజ్యాంగం ఉద్దేశించిన దానికి అతీతమైనదీ కావచ్చు.

వివక్ష ఉన్న సమాజాంలో అణగారిన వర్గాల వారందరినీ కలిపి ఎస్.సి.లు అన్న ఒకే మాట వాడేట్టు చేయడం ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. ఆ రకంగా దళితులు అన్న మాటను ప్రభుత్వం కళంకితమైందిగా భావిస్తూ ఉండవచ్చు. బౌద్ధులను, ఎస్.సి.లను విడదీసి చూడడాలనే ఉద్దేశమూ ఉండి ఉంటుంది. కాని ఎస్.సి.లు అన్న మాటే వాడాలి అన్న ప్రభుత్వ సూచన దళితులపై ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగించడమే. దళితులు అన్న మాట ఆ వర్గాలు సైద్ధాంతికగా, సాంస్కృతికగా సంఘటితం కావడానికి ఉపయోగపడ్తుంది. ఇది వారి పరిణామక్రమానికి దోహదం చేస్తుంది. మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ దిల్లీలోని బోట్ క్లబ్ వద్ద 1978లో లక్షలాదిగా అణగారిన వర్గాలవారు దళిత్ పాంథర్ల పేర సమీకృతం కావడమే వారి ఆకాంక్షకు నిదర్శనం. వ్యవస్థ లోపం కారణంగా రోహిత్ వేముల మృతి తర్వాత కూడా ఈ వర్గాలవారు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం కూడా వారి సంఘటిత కార్యాచరణకు ప్రతీక. అందువల్ల దళితులు అన్న పదాన్ని ఎస్.సి.లు అని కుదించనవసరం లేదు.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  19 Sep 2018 1:57 AM GMT
Next Story