Telugu Global
NEWS

ఫస్ట్ హరీష్.. సెకండ్ కేటీఆర్.. కేసీఆర్ ప్రాధాన్యం..?

సభ తేలిపోయాక భారీ పార్టీ కార్యక్రమాల విషయంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావును పక్కనపెట్టడం ఎంత తప్పో కేసీఆర్ కు తెలిసివచ్చిందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. కొడుకుపై నమ్మకం ఉన్నా.. అది అతినమ్మకమైతే ప్రమాదమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కేటీఆర్ తోపాటు హరీష్ ను కూడా ఎన్నికల సంగ్రామంలో ఇన్ వాల్వ్ చేస్తున్నారు. హరీష్ కు మెదక్ పూర్వ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పజెప్పినట్టు గులాబీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే నిజమైతే కొంత […]

ఫస్ట్ హరీష్.. సెకండ్ కేటీఆర్.. కేసీఆర్ ప్రాధాన్యం..?
X

సభ తేలిపోయాక భారీ పార్టీ కార్యక్రమాల విషయంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావును పక్కనపెట్టడం ఎంత తప్పో కేసీఆర్ కు తెలిసివచ్చిందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. కొడుకుపై నమ్మకం ఉన్నా.. అది అతినమ్మకమైతే ప్రమాదమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కేటీఆర్ తోపాటు హరీష్ ను కూడా ఎన్నికల సంగ్రామంలో ఇన్ వాల్వ్ చేస్తున్నారు. హరీష్ కు మెదక్ పూర్వ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పజెప్పినట్టు గులాబీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే నిజమైతే కొంత కేటీఆర్ పర్ ఫామెన్స్ మీద కేసీఆర్ కు అసంతృప్తి వ్యక్తమైనట్టేనని భావిస్తున్నారు.

అయితే కొంగరకలాన్ సభ ఆశించిన స్థాయిలో ఫలితం రాని తర్వాతే కేసీఆర్ తన అల్లుడు హరీష్ కు ప్రాధాన్యం ఇస్తున్నాడని టీఆర్ఎస్ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అందుకే కొంగర కలాన్ సభ నిరాశ నుంచి తేరుకోవడానికి హరీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సభకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. హరీష్ దాన్ని విజయవంతం చేయడం జరిగిపోయింది. ఇలా ముందస్తు ప్రకటనతో ఫస్ట్ సభను హరీష్ చేతుల్లో పెట్టి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు తన రెండో ప్రాధాన్యం కేటీఆర్ కు ఇచ్చాడు.

టీఆర్ఎస్ రాజకీయాల్లో ఇప్పుడు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకే అమిత ప్రాధాన్యం దక్కుతోంది. ఎందుకంటే సిద్దిపేట నుంచి కేసీఆర్, హరీష్, సిరిసిల్ల నుంచి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిధులైనా.. పనులైనా పార్టీ కార్యక్రమాలైనా ఇక్కడి నుంచి మొదలుపెట్టడం కేసీఆర్ కు అలవాటుగా మారింది.

అందుకే తాజాగా మొదటి చాన్స్ అల్లుడికిచ్చిన కేసీఆర్ తాజాగా రెండో చాన్స్ ను కేటీఆర్ కు ఇచ్చాడు. ఈ నెల 20 తర్వాత సిరిసిల్ల జిల్లాలో రెండో ఆశీర్వాద సభను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం సభ, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మొదటి ప్రాధాన్యం అల్లుడు, కొడుక్కేనని అర్థమైపోయింది.

First Published:  19 Sep 2018 2:06 AM GMT
Next Story