Telugu Global
National

కుస్తీమే సవాల్ అంటున్న కవితాదేవి

డబ్ల్యు డబ్ల్యు ఈ కుస్తీలో భారత సంచలనం హర్యానా నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన వస్తాదు 35 ఏళ్ల వయసులో కుస్తీమే సవాల్ అంటున్న కవితాదేవి అమెరికా వేదికగా వచ్చే నెలలో జరిగే… వరల్డ్ రెస్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ బరిలోకి భారత మహిళా వస్తాదు కవితా దేవి దిగనుంది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా వస్తాదుగా చరిత్ర సృష్టించనుంది. హర్యానా నుంచి ప్రపంచ స్థాయికి…. వస్తాదులు, కబడ్డీ క్రీడాకారులకు చిరునామాగా నిలిచే హర్యానాలోని మారుమూల […]

కుస్తీమే సవాల్ అంటున్న కవితాదేవి
X
  • డబ్ల్యు డబ్ల్యు ఈ కుస్తీలో భారత సంచలనం
  • హర్యానా నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన వస్తాదు
  • 35 ఏళ్ల వయసులో కుస్తీమే సవాల్ అంటున్న కవితాదేవి

అమెరికా వేదికగా వచ్చే నెలలో జరిగే… వరల్డ్ రెస్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ బరిలోకి భారత మహిళా వస్తాదు కవితా దేవి దిగనుంది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా వస్తాదుగా చరిత్ర సృష్టించనుంది.

హర్యానా నుంచి ప్రపంచ స్థాయికి….

వస్తాదులు, కబడ్డీ క్రీడాకారులకు చిరునామాగా నిలిచే హర్యానాలోని మారుమూల ప్రాంతానికి చెందిన కవితాదేవికి… పాఠశాల స్థాయిలో కబడ్డీ ప్లేయర్ గా గుర్తింపు ఉంది. ఆ తర్వాత కబడ్డీ నుంచి పవర్ లిఫ్టింగ్ క్రీడవైపు కవితాదేవి దృష్టి మళ్లించింది. దక్షిణాఫ్రికా వేదికగా గతేడాది ముగిసిన 2016 ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది.

సాంప్రదాయాలు, కట్టుబాట్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే హర్యానా సమాజం నుంచి వచ్చిన కవితాదేవికి ఏడేళ్ల కుమారుడు సైతం ఉన్నాడు. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో…. మూడుపదుల వయసులోనూ క్రీడారంగంలో తన ప్రస్థానం కొనసాగిస్తూ…. WWE యంగ్ క్లాసిక్ బరిలోకి కవితాదేవి అడుగుపెట్టింది. సల్వార్ కమీజ్ ధరించి… కుస్తీమే సవాల్ అంటూ ప్రత్యర్థులను ఎత్తి కుదేసింది.

ఖలీ శిక్షణ లో…..
WWE కుస్తీలో భారత తొలివస్తాదు ద గ్రేట్ ఖలీ కమ్ దలీప్ సింగ్ రాణా వద్ద… కవితా దేవి శిక్షణ తీసుకొంది. WWE వస్తాదుగా తనను తాను తీర్చిదిద్దుకోడానికి… కవితాదేవి గంటలతరబడి జిమ్ లో సాధన చేసింది.

ప్రపంచ మహిళా ఫ్రీ-స్టయిల్ కుస్తీలో పోగట్ సిస్టర్స్ తో పాటు… సాక్షీ మాలిక్ లాంటి వస్తాదులు విజయాలతో పాటు పతకాలు సాధిస్తూ దేశానికే గర్వకారణంగా నిలుస్తుంటే…. కవితాదేవి మాత్రం… క్రేజీ క్రేజీ WWE కుస్తీని ఎంచుకొంది. ఈ తరహా కుస్తీలో విజేతగా నిలిచిన భారత తొలిమహిళగా నిలవాలన్న కవితాదేవి లక్ష్యం నెరవేరాలని కోరుకొందాం.

భారత్ లో మహిళలు అంటే సుకుమారంగా ఉండే గృహిణులు మాత్రమే కాదు…. 35 ఏళ్ల వయసులో ఓ వైపు కుటుంబబాధ్యతలు నిర్వర్తిస్తూనే… కుస్తీలు పట్టే ధీరాదిధీరలు కేవలం భారత మహిళలు మాత్రమే అనటానికి..
నిలువెత్తు నిదర్శనం కవితాదేవి.

First Published:  19 Sep 2018 1:34 AM GMT
Next Story